iDreamPost

Krithi Shetty : బేబమ్మ బ్యూటీ తెలివైన ప్లానింగ్

Krithi Shetty : బేబమ్మ బ్యూటీ తెలివైన ప్లానింగ్

సరైన ప్లానింగ్, సబ్జెక్టు సెలక్షన్ ఉండాలి కానీ అసలే హీరోయిన్ల కొరతతో సతమతమవుతున్న టాలీవుడ్ లో జెండా పాతేందుకు కొత్త భామలకు మంచి అవకాశాలు ఉన్నాయి. దానికి ఉదాహరణగా కృతి శెట్టిని చెప్పుకోవచ్చు. ఉప్పెన లాంటి సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న ఈ అమ్మాయి తక్కువ గ్యాప్ లోనే సీనియర్ హీరోలతో నటించేందుకు ఇంటిమేట్ సీన్లకు ఎస్ చెప్పేందుకు వెనుకాడటం లేదు. దానికి ఉదాహరణగా ఇవాళ రిలీజైన శ్యామ్ సింగ రాయ్ టీజర్ నే చెప్పుకోవచ్చు. 37 ఏళ్ళ నానితో పట్టుమని 20 వయసు కూడా టచ్ కాని కృతి ఏకంగా లిప్ లాక్ చేయడం విశేషమే. ఇదేమైనా కెమెరా ట్రిక్ అనుకోవడానికి లేదు. సహజంగానే ఉంది మరి.

మొదటి సినిమా ఉప్పెనలోనూ కృతి మొహమాటపడలేదు. కాకపోతే మరీ శృతి మించకుండా జాగ్రత్త పడింది. శ్యామ్ సింగ రాయ్ తర్వాత బంగార్రాజులోనూ ఈ అమ్మడు నాగ చైతన్య సరసన చేస్తోంది. ఇదీ క్లిక్ అయితే తనను పట్టుకోవడం కష్టమే. ఆపై సుధీర్ బాబుతో చేస్తున్న ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, రామ్-లింగు స్వామిల క్రేజీ ప్రాజెక్ట్ రాబోయే ఆరు నెలల్లోనే ఇవన్నీ వచ్చేస్తాయి. ఇంత స్పీడ్ గా ఇంకే కొత్త హీరోయిన్ బిజీగా లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సంతకం చేసినవి, చర్చల దశలో ఉన్నవి, వెయిటింగ్ లిస్ట్ లో చేరినవి పదుల సంఖ్యలో ఉన్నట్టు సమాచారం. చూస్తుంటే ఇంకో రెండేళ్ల వరకు దొరకడం కష్టమేమో.

ఒకరకంగా చెప్పాలంటే కృతి శెట్టి లాంటి వాళ్ళు ఇలా ప్లాన్ చేసుకోవడమే కరెక్ట్. సాయి పల్లవి లాగా పూర్తిగా పెర్ఫార్మన్స్ ని నమ్ముకుని నెట్టుకురాలేరు. గ్లామర్ షో చేయనని ముద్దులు పెట్టనని కండిషన్లు పెట్టలేరు. అందుకే ఈ అమ్మాయి మంచి ప్లానింగ్ తో సెట్ చేసుకుంటోంది. సోషల్ మీడియాలో మాత్రం నాని కృతిల ముద్దు సీన్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. శ్యామ్ సింగ రాయ్ లో సాయిపల్లవి కూడా ఉన్నప్పటికీ ఇద్దరి కాంబినేషన్లో సీన్లు ఉండకపోవచ్చని టాక్. రెండు కాలాలకు సంబంధించిన కథ కాబట్టి ఛాన్స్ లేనట్టే. సో ఒకే ఫ్రేమ్ లో ఉండి తనను డామినేట్ చేస్తుందేమోననే టెన్షన్ కూడా అక్కర్లేదు

Also Read : Bimbisara : డేట్ కోసం నందమూరి హీరో తిప్పలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి