iDreamPost

బ్లాక్‌ డ్రెస్‌.. క్యూట్‌ లుక్స్‌తో చంపేస్తున్న బేబమ్మ!

బ్లాక్‌ డ్రెస్‌.. క్యూట్‌ లుక్స్‌తో చంపేస్తున్న బేబమ్మ!

ఉప్పెన సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది కన్నడ బ్యూటీ కృతీ శెట్టి. మొదటి సినిమాతోనే సూపర్‌ హిట్‌ను అందుకుంది. ఈ సినిమా సాధించిన విజయంతో కృతీ పేరు మారుమోగింది. తర్వాత వచ్చిన బంగార్రాజు, శ్యాం సింగరాయ్‌ సినిమాలు కూడా విజయం సాధించటంతో వరుస ఆఫీర్లు క్యూ కట్టాయి. అయితే, అనుకోని విధంగా ఆ తర్వాతి నాలుగు సినిమాలు వరుసగా ఫెయిల్‌ అయ్యాయి. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఆమె చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు.

మలయాళంలో ‘అజయంటే రాండమ్‌ మోశానమ్‌’ సినిమాతో పాటు.. తమిళంలో ‘ జీనీ’ అనే సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఇక, అసలు విషయానికి వస్తే.. కృతీ శెట్టి తాజాగా, తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ ఫొటో షూట్‌కు సంబంధించిన ఫొటోలు షేర్‌ చేసింది. బ్లాక్‌ డ్రెస్‌లో.. క్యూట్‌ లుక్స్‌తో బేబమ్మ కుర్రాకారు హృదయాలను కొల్లగొడుతోంది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి, కృతీ శెట్టి బ్లాక్‌ డ్రెస్‌ ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Krithi Shetty (@krithi.shetty_official)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి