iDreamPost

Krithi Shetty : నాని రీమేకుల మీద షాహిద్ కన్ను

Krithi Shetty : నాని రీమేకుల మీద షాహిద్ కన్ను

గత ఏడాది ఉప్పెనతో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టు ముంబై టాక్. శ్యామ్ సింగ రాయ్ రీమేక్ కోసం ఒరిజినల్ వెర్షన్ లో పోషించిన క్యారెక్టర్ నే తనకు ఆఫర్ చేశారట. అయితే ఓకే చెప్పిందో లేదో ఇంకా క్లారిటీ లేదు. హీరోగా షాహిద్ కపూర్ ఫిక్స్ అయినట్టుగా తెలిసింది. భారీ బడ్జెట్ తో ఓ పెద్ద నిర్మాణ సంస్థ దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు వినికిడి. షాహిద్ ఈ మధ్య నాని సినిమాల మీద మనసు పారేసుకుంటున్నాడు. జెర్సీని చూసి విపరీతంగా ఇష్టపడి కష్టపడి మరీ ఆ క్యారెక్టర్ చేశాడు. కరోనా లాక్ డౌన్ తదనంతర పరిస్థితుల వల్ల విడుదల ఆలస్యమయ్యింది కానీ లేకపోతే డిసెంబర్ లోనే వచ్చేది.

వీటికన్నా ముందు అతను అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో రెండు వందల కోట్ల క్లబ్బులో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. దానికి వచ్చిన ఇమేజ్ ని నిలబెట్టుకునే ప్రయత్నంలో స్ట్రెయిట్ కథలను అంత ఈజీగా ఒప్పుకోవడం లేదు. శ్యామ్ సింగ రాయ్ ఎలాగూ ప్రూవ్ చేసుకున్న సబ్జెక్టు. అందులోనూ కోల్కతా బ్యాక్ డ్రాప్ ఉంది కాబట్టి నార్త్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అఫీషియల్ అయ్యేదాకా చెప్పలేం కానీ నిప్పు లేనిదే పొగరాదుగా. కృతి శెట్టి ఒప్పుకుంటే మాత్రం కేవలం ఏడాది వ్యవధిలో బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన ఘనత దక్కించుకుంటుంది. అక్కడ కూడా హిట్ అయితే ఇక ఆఫర్లు క్యూ కడతాయి. అందులో అనుమానం లేదు.

మనమేమో మలయాళం రీమేకుల వెనుక పడుతుంటే అక్కడి హిందీ హీరోలు మన సినిమాలను టార్గెట్ చేసుకుంటున్నారు. హీరోయిన్ల పరంగానూ ఇక్కడి వాళ్లను తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పూజా హెగ్డే, రష్మిక మందన్న, రాశి ఖన్నా, కాజల్ అగర్వాల్, తమన్నా, మెహ్రీన్ ఇలా బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకున్న ముద్దుగుమ్మల లిస్టు పెద్దదే ఉంది. అయితే కృతి శెట్టి ఇక్కడే చాలా బిజీగా ఉంది. ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం లు షూటింగులు జరుగుతున్నాయి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. హ్యాట్రిక్ హిట్లతో కెరీర్ మొదలుపెట్టిన కృతికి మంచి గోల్డెన్ టైం నడుస్తోంది

Also Read : The Kashmir Files : కాశ్మీర్ ఫైల్స్ కు బ్రేకులు పడటం లేదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి