iDreamPost

ఎదురుచూసే కొద్దీ ఆలస్యమా రంగమార్తాండా..!

ఎదురుచూసే కొద్దీ ఆలస్యమా రంగమార్తాండా..!

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకున్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. ఒకప్పుడు సిందూరం లాంటి కల్ట్ క్లాసిక్, నిన్నే పెళ్లాడతా లాంటి ఫ్యామిలీ బ్లాక్ బస్టర్స్ ఒకే టైంలో ఇచ్చిన ట్రాక్ రికార్డు ఆయన సొంతం. దేశభక్తి ప్రధానంగా ఖడ్గం స్థాయిలో ఇంకే దర్శకుడు మరో సినిమా చేయలేదన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం. అయితే వరస డిజాస్టర్లతో తన మార్కెట్ తో పాటు అవకాశాలను తగ్గించుకున్న కృష్ణవంశీ ప్రస్తుతం రంగమార్తాండ చేసిన సంగతి తెలిసిందే. దీని షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. డబ్బింగ్ కార్యక్రమాలు గత నాలుగైదు నెలలుగా జరుగుతూనే ఉన్నాయి. వాటి తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మినహాయించి ఎలాంటి అప్డేట్ రావడం లేదు.

Did Krishna Vamsi Rangamarthanda stop? కృష్ణవంశీ రంగమార్తాండ ఆగిపోయిందా?

ఈ రంగమార్తాండలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిది మాస్ట్రో ఇళయరాజా సంగీతం. టాలీవుడ్ కు మ్యూజిక్ ఇవ్వడం బాగా తగ్గించేసిన ఇసై జ్ఞాని దీంతో మరోసారి తన మేజిక్ టచ్ వినిపిస్తారని మ్యూజిక్ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ కాంబోలో వచ్చిన అంతఃపురం ఇప్పటికీ వన్ అఫ్ ది బెస్ట్ గా ఫ్యాన్స్ చెప్పుకుంటారు. రెండోది మరాఠి సూపర్ హిట్ నట సామ్రాట్ కు ఇది అఫీషియల్ రీమేక్. ఒరిజినల్ వెర్షన్ లో అద్భుతంగా మెప్పించిన నానా పాటేకర్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో ప్రకాష్ రాజ్ ఇందులో ప్రాణ ప్రతిష్ట చేశారని ఇన్ సైడ్ టాక్. ఎప్పుడూ నవ్వించే బ్రహ్మానందం చాలా ఎమోషనల్ క్యారెక్టర్ చేశారనే సమాచారం యూనిట్ నుంచి ఉంది.

Rangamarthanda: కృష్ణవంశీ మార్క్‌లో 'రంగమార్తాండ' టైటిల్ అనౌన్స్‌మెంట్.. !  - 10TV Telugu

ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పుడు రంగమార్తాండ ఎందుకు లేట్ అవుతోందన్న కారణం మాత్రం తెలియడం లేదు. ఇలాంటి కంటెంట్ థియేటర్ లో ఎంత మేరకు వర్కౌట్ అవుతుందనే అనుమానం కారణంగానే బిజినెస్ డీల్స్ స్లోగా ఉన్నాయనే టాక్ నడుస్తోంది ఇవి క్లియర్ అయితే విడుదలకు రూట్ క్లియర్ అవుతుంది. ఓ రంగస్థల నటుడి జీవితానికి సంబంధించిన ఒక విభిన్న కోణంలో రంగమార్తాండలో ఆవిష్కరించారు. ఒకవేళ ఓటిటి నిర్ణయం తీసుకున్నా మంచిదే కానీ నిర్మాత నుంచి ఏదైనా క్లారిటీ వస్తే బాగుంటుంది. రమ్యకృష్ణ అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ భావోద్వేగాల డ్రామాకు మోక్షం వచ్చే ఏడాదే దక్కేలా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి