iDreamPost

త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న కృష్ణ.. కాబోయే భర్తను పరిచయం చేసిన తింగరి పిల్ల..

  • Published Nov 05, 2023 | 1:28 PMUpdated Nov 05, 2023 | 1:28 PM

ప్రస్తుతం బుల్లితెర మీద టెలికాస్ట్‌ అవుతోన్న సీరియల్స్‌లో కృష్ణ ముకుంద మురారీ సీరియల్‌ ఒకటి. దీనిలో ప్రాధాన పాత్రలో నటిస్తోన్న కృష్ణవేణి అలియాస్‌ ప్రేరణ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఆ వివరాలు..

ప్రస్తుతం బుల్లితెర మీద టెలికాస్ట్‌ అవుతోన్న సీరియల్స్‌లో కృష్ణ ముకుంద మురారీ సీరియల్‌ ఒకటి. దీనిలో ప్రాధాన పాత్రలో నటిస్తోన్న కృష్ణవేణి అలియాస్‌ ప్రేరణ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఆ వివరాలు..

  • Published Nov 05, 2023 | 1:28 PMUpdated Nov 05, 2023 | 1:28 PM
త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న కృష్ణ.. కాబోయే భర్తను పరిచయం చేసిన తింగరి పిల్ల..

ప్రస్తుతం సినిమాల కన్నా సీరియల్స్‌కే క్రేజ్‌ ఎక్కువ. ఏళ్ల తరబడి సాగుతూ.. ప్రేక్షకుల అభిమానాన్ని చురగొంటాయి. ఇక కొన్ని సీరియల్స్‌ ఎంత ఫేమస్‌ అవుతాయంటే.. సీరిల్స్‌లోని ప్రధాన పాత్రదారులను తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తారు. ఇక ప్రసుత్తం బుల్లితెర మీద టెలికాస్ట్‌ అవుతోన్న సీరిల్స్‌లో ప్రేక్షకులు అభిమానాన్ని సంపాదించి.. టాప్‌ రేటింగ్‌తో దూసుకుపోతున్న సీరియల్‌.. కృష్ణ ముకుంద మురారీ సీరియల్‌ ఒకటి. దీనిలో ప్రధాన పాత్రధారులైన కృష్ణ, ముకుంద, మురారీలతో పాటు ఈ సీరియల్‌లో నటిస్తోన్న ప్రతి ఒక్కరూ తమ పాత్రలో ఒదిగిపోయారు. తమ నటనతో వారి వారి పాత్రలకు ప్రాణం పోశారు.

ఇక కథ విషయానికి వస్తే.. తండ్రి కోరిక మేరకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న కృష్ణ.. ఆ తర్వాత తన భర్త మంచితనాన్ని అర్థం చేసుకుని.. అతడితో కలిసిపోవాలనుకుంటుంది. ఈ సమయంలో తనకు ఎదురయ్యే పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నది అనేదే ఈ కథ. ప్రస్తుతం ఈ సీరియల్‌ టాప్‌ రేటింగ్‌తో దూసుకుపోతుంది.

ఇక సీరియల్‌లో కృష్ణ పాత్రలో మంచి తనం, అమాయకత్వం, మొండితనం అన్నీ కలగలిపి ఉంటాయి. ఇక ఈ కృష్ణవేణి పాత్రలో.. కన్నడ అమ్మాయి ప్రేరణ చక్కగా ఒదిగిపోయింది. తన అందం, అమాయకత్వంతో.. తింగరి పిల్లగా ప్రేక్షకుల ప్రేమాభిమానాలను సంపాదించుకుంది. ఇక ప్రేరణ.. హైదరాబాద్‌లో జన్మించినప్పటికి.. బెంగళూరులో పెరిగింది. మొడల్‌గా కెరీర్‌ ప్రారంభించి. కన్నడ సినిమాల్లో నటిస్తూనే సీరియల్స్‌లో కూడా మంచి పాత్రలు చేస్తూ ఉంది. ఇలా ఉండగానే తెలుగులో కృష్ణ ముకుందా మురారీ సీరియల్‌ ద్వారా కృష్ణవేణి పాత్రతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

ఈ సీరియల్‌లో తింగరి తనంతో ఆకట్టుకున్న కృష్ణమ్మ అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో అభిమానం. ఇక సీరియల్‌లో మురారి భార్యగా పరిచయం అయిన కృష్ణవేణి.. త్వరలోనే నిజ జీవితంలో కూడా పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈ క్రమంలో తనకు కాబోయే భర్తని పరిచయం చేసింది. ఎంగేజ్‌మెంట్‌ అయిన విషయాన్ని వెల్లడిస్తూ.. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేసింది.

ప్రేరణకు కాబోయే భర్త పేరు శ్రీపాద్. ఈ ఫొటోలు చూసిన నెటిజనులు, అభిమానులు.. ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది.. మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అని కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక శ్రీపాద కూడా హీరోలా ఎంతో హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడని కామెంట్స్‌ చేస్తున్నారు. కృష్ణకు అభినందనలు తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Vikas Alagarsamy (@ooak.photography)

 

View this post on Instagram

 

A post shared by Vikas Alagarsamy (@ooak.photography)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి