iDreamPost

NBK And SSMB : అరుదైన కలయికకు కొరటాల ప్లాన్ ?

NBK And SSMB : అరుదైన కలయికకు కొరటాల ప్లాన్ ?

ప్రస్తుతం ఆచార్య విడుదల కోసం ఎదురు చూస్తున్న కొరటాల శివ తర్వాత ఎన్టీఆర్ 30ని చేయబోతున్న సంగతి తెలిసిందే. తారక్ చేతికి గాయం వల్ల ఇది రెగ్యులర్ షూట్ కు వెళ్లేందుకు ఇంకొంత టైం పట్టేలా ఉంది. పైగా యంగ్ టైగర్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్ల కోసం సమయం కేటాయించాల్సి ఉంది. ఇవన్నీ చూసుకుంటే ఇంకో నెలన్నరకు పైగానే టైం తీసుకునేలా ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత మహేష్ బాబు బాలయ్య కాంబినేషన్ లో ఒక పవర్ ఫుల్ సబ్జెక్టుని కొరటాల రాసుకున్నట్టు వచ్చిన వార్త ఇండస్ట్రీ వర్గాల్లోనే కాదు అభిమానుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు లేకపోలేదు

నిజంగా ఇద్దరినీ బ్యాలన్స్ చేయగల సత్తా సబ్జెక్టులో ఉంటే సెట్ చేయడం మరీ అసాధ్యం కాదు. గతంలో బాలయ్య తన పాత్ర కీలకం అనిపించినప్పుడు మంచు మనోజ్ ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో స్పెషల్ క్యారెక్టర్ చేయడానికి వెనుకాడలేదు. ఆ మూవీలో అంతో ఇంతో పాజిటివ్ గా చెప్పుకోగలిగిన అంశం అదొక్కటే. సో మహేష్ తో కాంబినేషన్ సెట్ అవుతుందంటే వెంటనే నో అనకపోవచ్చు. కాకపోతే ఇద్దరి మధ్య సీనియారిటీ వయసు వ్యత్యాసం ఉంది కాబట్టి కొరటాల శివ వీళ్ళిద్దరినీ ఎలా చూపిస్తాడన్నది ఆసక్తికరం. ఇది నిజమా కదా తెలియడానికి కూడా చాలా టైం పడుతుంది. ఎవరికి వారు ప్రస్తుత ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

అఖండ తర్వాత గోపీచంద్ మలినేనితో చేస్తున్న బాలయ్య ఆ తర్వాత కమిట్ అయిన సినిమాల తాలూకు వివరాలు ఇంకా బయటికి రాలేదు. అనిల్ రావిపూడితో ఉంటుందన్నారు కానీ అతని పేరు ఇప్పుడు దిల్ రాజు-పవన్ కళ్యాణ్ కాంబోలో వినపడుతోంది. ఏదీ క్లియర్ గా తెలీలేదు. ఇక మహేష్ సర్కారు వారి పాట ఫినిష్ చేశాక రాజమౌళి సినిమా మొదలుపెడతాడా లేక అదొక్క దానికే టైం కేటాయిస్తే ఏళ్ళు గడిచిపోతాయి కాబట్టి పారలల్ గా ఇంకేవైనా చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. మహేష్ నాన్న కృష్ణ బాలకృష్ణ కలిసి తెరమీద సుల్తాన్ లో నటించారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత సూపర్ స్టార్ అబ్బాయితో బాలయ్య జట్టు కడతారా. చూద్దాం

Also Read : Squid Game : స్క్విడ్ గేమ్స్ సంచలనం – నెట్ ఫ్లిక్స్ బంగారు బాతు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి