iDreamPost

ఏబీఎన్ కు కిషన్ రెడ్డి టెంకి జెల్ల

ఏబీఎన్ కు కిషన్ రెడ్డి టెంకి జెల్ల

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ భారత్ ను,ఆంధ్రప్రదేశ్ ను తన గుప్పిట్లోకి తీసుకున్నది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. అమెరికా బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలే కరోనా దెబ్బకు విలవిల్లాడుతూ ఏం చేయాలో తెలీక నిరత్తురులవుతున్నాయి. వేలల్లో కేసులు, వందల్లో మరణాలతో ఆయా దేశాలు భీతిల్లుతున్నాయి. దేశవిదేశాల్లోని ప్రధానుకు,రాజులు, మంత్రులు, అధికారులు, సినిమాయాక్టర్లు ఒకరేమిటి ఎందరో ముఖ్యులు ఈ వ్యాధికి గురైనారు.. కొందరు కొలుకున్నారు.

ఈ విపత్తునుంచి ఎలా బయటపడాలా అని అన్నివర్గాలు ఆలోచిస్తున్నాయి. డాక్టర్లు, పోలీసులు, స్వచ్చందసంస్థలు,శాస్త్రవేత్తలు రేయింబవళ్లు ఈ కరోనా నియంత్రణ చర్యల్లో భాగం పంచుకుంటున్నాయి. ఇదే తరుణంలో టిడిపి కోసమే పుట్టి ఆ పార్టీ సేవలో తరిస్తున్న ఎల్లో మీడియా మాత్రం ఈ పెను విపత్తును మరో కోణంలోంచి చూడడం మొదలుపెట్టింది. ఈ విపత్తు మాటున కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని బదనాం చేసే అవకాశాలను వెతుకుతునే ఉంది. అసలు చంద్రబాబే ఈ తరుణంలో ఉండుంటే పరిస్థితి ఇలా ఉండేనా ..కరోనాతో కరాటే ఆడి స్టేట్ మొత్తం కరోనా ఫ్రీ ఏరియగా చేసి ఉండేవాడు కదా అన్నట్లుగా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. పత్రికల్లో రాస్తున్నాయి.

ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నివాస గృహం రాజభవన్ లోని సిబ్బంది నలుగురికి కరోనా పాజిటివ్ రావడం ఎల్లోమీడియాను కోతికి కొబ్బరికాయ దొరికినట్లు అయింది. వెంటనే ఇది ముఖ్యమంత్రి జగన్ అసమర్థత గాను ప్రభుత్వం చేతగానీతనంగాను చూపించి చంద్రబాబును మళ్ళీ గుర్తు చేసేందుకు నానా తంటాలు పడింది. ఈ క్రమంలో ఏబీఎన్ ఛానల్ విలేకరి ఒకరు కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో కాసేపు మాట్లాడి రాజ్ భవన్ సిబ్బందికి  కరోనా రావడం గురించి ప్రస్తావించారు. ఇదంతా జగన్ వైఫల్యం అని కిషన్ రెడ్డి చెబుతారని ఆ ఛానల్ ప్రతినిధి ఆశించారు. ఐతే కిషన్ రెడ్డి మాత్రం రాజ్ భవన్ లో కరోనా వచ్చిందా అయితే ఏందీ.. అది ఎవరికైనా రావచ్చు. రాష్ట్రపతి భవన్ సిబ్బందికి కూడా వచ్చింది..ఇక్కడ 250 మంది ప్రతినిధులు ఉన్నారు.. నేను రోజూ చాలామందిని కలుస్తుంటాను. మీరూ ఇక్కడికి వచ్చారు..కరోనా రావాలంటే ఎలా అయినా వస్తుంది

ఈ విషయంలో ఎవరూ మినహాయింపు లేదు. పీఎంవో వారికి రావచ్చు,సీఎంలకు రావచ్చు అని సమాధానం ఇవ్వడంతో, కిషన్ రెడ్డి ఇంకేదో చెబితే గాయిగాయి చేద్దామని ఆశించిన ఏబీఎన్ ప్రతినిధి నిరాశ చెందారు. మొత్తానికి ఎల్లో మీడియాకు కిషన్ రెడ్డి భలే టెంకి జెల్ల కొట్టారు అంటూ వైసిపి శ్రేణులు అనుకుంటున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి