iDreamPost

వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను రద్దు చేయాలని ఖలిస్థాన్ ఉగ్రవాదుల బెదిరింపు

వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనున్న వేళ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఫైనల్ మ్యాచ్ ను రద్దు చేయాలని హెచ్చరించాడు.

వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనున్న వేళ ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఫైనల్ మ్యాచ్ ను రద్దు చేయాలని హెచ్చరించాడు.

వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను రద్దు చేయాలని ఖలిస్థాన్ ఉగ్రవాదుల బెదిరింపు

వన్డే వరల్డ్ కప్ 2023 ముగింపు దశకు చేరుకుంది. రేపు (19-11-2023) జరుగబోయే ఫైనల్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది. అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఫైనల్ లో భారత్, ఆస్ట్రేలియా తలపడబోతున్నాయి. టైటిల్ నెగ్గి విశ్వ విజేతగా నిలవాలని టీమిండియా దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఇరు జట్లు అహ్మదాబాద్ కు చేరుకున్నాయి. ప్రపంచ కప్ ఆరంభం నుంచి ఓటమన్నదే ఎరగకుండా అన్ని జట్లను ఓడించి రాజసంగా ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చింది రోహిత్ సేన. అయితే రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు మొదలయ్యాయి. మ్యాచ్ ను నిలిపివేయాలంటూ టెర్రరిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సిక్ ఫర్ జస్టిస్ సంస్థకు మెంబర్ గా ఉన్న ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ రద్దు చేయాలని హెచ్చరిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 గుజరాత్ అల్లర్ల గురించి పేర్కొంటు మతపరంగా ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నుంచి మోడీ గుణ పాఠం నేర్చుకోవాలని, ఇండియాలో కూడా ఇలాంటి యుద్ధం ప్రారంభమవుతుందని పన్నూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఉగ్రవాదుల నుంచి వచ్చిన బెదిరింపుల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది.

స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ కు విశేషమైన ఆదరణ లభించింది. స్టేడియాలకు క్రికెట్ ఫ్యాన్స్ పోటెత్తారు. రేపు భారత్, ఆసిస్ మధ్య జరగబోయే ఫైనల్ మ్యాచ్ కు భారీ సంఖ్యలో ఆడియెన్స్ హాజరుకానున్నారు. దేశ నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి సైతం క్రికెట్ లవర్స్ అహ్మదాబాద్ కు చేరుకున్నారు. ప్రపంచకప్ ఫైనల్ ను తిలకించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మ్యాచ్ కు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రేక్షకుల రక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి