iDreamPost

Raveena Tandon పవన్ సినిమాలో KGF ప్రధాని

Raveena Tandon పవన్ సినిమాలో KGF ప్రధాని

ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన కెజిఎఫ్ 2లో ప్రధాని రైమిక సేన్ గా నటించిన రవీనాటాండన్ కు ఎంత పేరు వచ్చిందో చూశాం. ఎప్పుడో 90 దశకంలో తెలుగులో బాలకృష్ణ బంగారు బుల్లోడు, నాగార్జున ఆకాశవీధిలో, వినోద్ కుమార్ రథసారధిలో నటించి మెప్పించిన రవీనా ఆ తర్వాత చాలా కాలం తెరకు దూరమయ్యారు. మధ్యలో ఉపేంద్ర లాంటి చిత్రాలు చేసినా కెరీర్ లో కంటిన్యూటీ లేకుండా పోయింది. ఇప్పుడు కెజిఎఫ్ 2 తర్వాత సీన్ మారిపోయింది. పవర్ ఫుల్ విమెన్ క్యారెక్టర్స్ కి తను మంచి ఛాయస్ అనే అభిప్రాయం దర్శకుల్లో ప్రేక్షకుల్లో కలిగింది. అందుకే ఇప్పుడు ఒక్కొక్కటిగా క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి.

అందులో భాగంగా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందబోయే భవదీయుడు భగత్ సింగ్ లో ఒక ముఖ్యమైన పాత్రకు తనను సంప్రదించినట్టు తెలిసింది. రాజకీయ నేపధ్యం కలిగిన ఆ క్యారెక్టర్ కు తనైతేనే న్యాయం చేయగలదన్న ఉద్దేశంతో ఈ ప్రపోజల్ పెట్టారట. అయితే ఒప్పుకున్నది లేనిది ఇంకా తెలియాల్సి ఉంది. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. జనసేన కార్యకలాపాల వల్ల దీనికి బ్రేక్ పడుతూనే ఉంది. ఇదయ్యాక భవదీయుడు మొదలుపెట్టాల్సి ఉంది. కానీ ఇంతలో వినోదయ సితం రీమేక్ తాలూకు వార్తలు బయటికి రావడంతో ఇది ఇంకాస్త లేట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.

ఇమేజ్ తిరిగి వచ్చేసింది కాబట్టి రవీనాటాండన్ కనక పవన్ మూవీలో చేస్తే సెకండ్ ఇన్నింగ్స్ కోణంలో ఇక్కడ మంచి కెరీర్ ని సంపాదించుకోవచ్చు. ఎలాగూ సపోర్టింగ్ రోల్స్ కోసం ఆర్టిస్టుల షార్టేజ్ ఉంది కాబట్టి ఆ లోటు కొంతైనా తీరుతుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ క్లారిటీ వస్తుంది. భవదీయుడు భగత్ సింగ్ ప్యాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేశారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. భీమ్లా నాయక్ సైతం ముందు హిందీ వెర్షన్ డబ్బింగ్ అనుకుని ఆ మేరకు ట్రైలర్ కూడా విడుదల చేశారు. కానీ థియేట్రికల్ రిలీజ్ ఆగిపోయింది. హరిహర వీరమల్లు మాత్రం మల్టీ లాంగ్వేజ్ లోనే రెడీ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి