iDreamPost

తెలుగులోకి KGF మదర్.. ఏ ప్రాజెక్ట్ తో తెలుసా?

  • Author ajaykrishna Updated - 09:26 AM, Thu - 5 October 23
  • Author ajaykrishna Updated - 09:26 AM, Thu - 5 October 23
తెలుగులోకి KGF మదర్.. ఏ ప్రాజెక్ట్ తో తెలుసా?

కొన్ని సినిమాలు ఒక్కసారికే నచ్చేస్తుంటాయి. అలాగే కొంతమంది తారలు కూడా ఒక్క సినిమాతోనే చాలా దగ్గరైన ఫీలింగ్ కలుగుతుంది. అందుకు కారణం.. వాళ్ల అందచందాలు కాదు. వాళ్ల అద్భుతమైన నటన, ఆ క్యారెక్టర్ లోని ఎమోషన్స్ తో బాగా కనెక్ట్ అయిపోతారు. అలా ఒక్క సినిమాతో కనెక్ట్ అయ్యేవారు చాలా రేర్. అలాంటి అరుదైన యాక్టర్స్ లో ఒకరు అర్చన జోయిస్. ఈమె పేరు వింటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ.. బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ మూవీలో రాఖీభాయ్ తల్లి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. కేజీఎఫ్ లో రాఖీ తల్లి శాంతమ్మ క్యారెక్టర్ లో అర్చన అద్భుతమైన నటన కనబరిచి అందరి మనసులు గెలుచుకుంది. ముఖ్యంగా తెలుగు వాళ్లకు తెగ నచ్చేసింది.

కట్ చేస్తే.. సినిమాలో తల్లిగా కనిపించిన అర్చన.. బయట చూస్తే చాలా యంగ్. హీరోయిన్స్ కంటే కళగా ఉంది. అరే.. ఇలాంటి బ్యూటీని తల్లిగా పరిచయం చేశారే అని అందరు అనుకున్నారు. కానీ.. ఏదైతేనేం ఇండస్ట్రీకి మరో క్యూట్ బ్యూటీని అందించారని సర్దిచెప్పుకున్నారు. కేజీఎఫ్ ఒక్క సినిమాతో అర్చనకు తెలుగులో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగా ఏర్పడింది. నిజానికి అర్చన కన్నడ యాక్టర్. కన్నడలో చాలా సినిమాలు చేసింది. క్లాసికల్ డాన్సర్ గా కూడా మంచి పేరుంది. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ పోస్టులు పెడుతుంటుంది. అయితే.. అర్చన ఎప్పుడెప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుందా? అని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు.

తాజాగా ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ చెప్పేసింది. అర్చన తెలుగులో డెబ్యూకి రెడీ అయిపోయింది. ఏ హీరో సినిమా.. డైరెక్టర్ ఎవరు? అనే సందేహాలు మీకు రావచ్చు. ఆ వివరాల్లోకి వెళ్తే.. అర్చన డెబ్యూ చేస్తోంది సినిమాతో కాదు. వెబ్ సిరీస్ తో. అదికూడా హార్రర్ వెబ్ సిరీస్. డైరెక్టర్ ఓంకార్ తెరకెక్కించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘మాన్షన్ 24’లో అర్చన నటించింది. అక్టోబర్ 17 నుండి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ లో.. అర్చన కీలకపాత్ర పోషించింది. ఈ సిరీస్ లో వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ ప్లే చేసింది. ఇక ప్రస్తుతం మాన్షన్ 24 ట్రైలర్.. సోషల్ మీడియా విశేషంగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్ లో అర్చనని చూసి తెలుగు ఫ్యాన్స్ అంతా ఖుషి అవుతున్నారు. మరి ఈ సిరీస్ తర్వాత అర్చన తెలుగులో బిజీ అవుతుందేమో చూడాలి. అర్చన గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి