iDreamPost

IMDB – టాప్ సినిమాలన్నీ దక్షిణాదివే

IMDB – టాప్ సినిమాలన్నీ దక్షిణాదివే

ప్రపంచవ్యాప్తంగా భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాల రేటింగ్స్ రివ్యూలకు ప్రామాణికంగా భావించే ఐఎండిబి టాప్ ఇండియన్ సినిమాల లిస్టు విడుదల చేసింది. మొదటి స్థానం ఎలాంటి అనుమానం లేకుండా ఆర్ఆర్ఆర్ కే దక్కింది. ఏదో ఒక విభాగంలో ఆస్కార్ వస్తుందన్న గట్టి నమ్మకం వ్యక్తమవుతున్న టైంలో ఇవన్నీ శుభసూచనలుగానే చెప్పుకోవాలి. రెండో ప్లేస్ ది కాశ్మీర్ ఫైల్స్ సంపాదించుకుంది. ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకున్నఈ ఒక్క మూవీనే బాలీవుడ్ వైపు నుంచి చోటు దక్కించుకోవడం గమనార్హం. మూడో స్థానం యష్ రాఖీ భాయ్ గా అరాచకం చేసిన కెజిఎఫ్ చాప్టర్ 2 తీసుకుంది

వరసగా విక్రమ్, కాంతార, రాకెట్రీ నంబ్రి ఎఫెక్ట్, మేజర్, సీతారామం, పొన్నియన్ సెల్వన్ 1, 77 7 చార్లీలు ఉన్నాయి. మొత్తం టాప్ 10లో దక్షిణాదివి తొమ్మది. వాటిలో తెలుగు మూడు కన్నడ మూడు తమిళం మూడు సరిసమానంగా పంచుకున్నాయి. దీన్ని బట్టే సౌత్ డామినేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విచిత్రంగా బ్రహ్మస్త్ర పార్ట్ 1కి చోటే దక్కకపోవడం పెద్ద ట్విస్టు. మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసినా నెటిజెన్లు తగినంత గుర్తింపు ఇవ్వలేకపోయారు. విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు కంటెంట్ పరంగా సోసోగానే రెస్పాన్స్ తెచ్చుకున్న బ్రహ్మాస్త్రకు ఇది ఒకరకంగా పరాభవమే. గంగూబాయి కటియవాడికి సైతం జనాలు నిర్మొహమాటంగా నో చెప్పారు

రాబోయే రోజుల్లో మన ఆధిపత్యం ఇంకా పెరగనుంది. పుష్ప 2, రామ్ చరణ్ 15, హరిహర వీరమల్లు వగైరాలు ప్యాన్ ఇండియా రేంజ్ లో విపరీతమైన అంచనాలు మోయబోయే సినిమాలే. పాతిక కోట్లలోపే రూపొందిన హనుమాన్ హక్కుల కోసం ఎగబడటం దీనికో చిన్న ఉదాహరణగా చెప్పొచ్చు. రానా అన్నట్టు ఒకప్పుడు సౌత్ సినిమా అంటూ చులకనగా చూసే స్థాయి నుంచి ఇవాళ కాంతార లాంటి వాటిని ఎగబడి చూస్తూ అక్షయ్ కుమార్ అమీర్ ఖాన్ లాంటి వాళ్లకు మొండిచేయి చూపిస్తున్న ఆడియన్స్ చాలా స్పష్టమైన తీర్పులు ఇస్తున్నారు. కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్న దక్షిణాది సినీ పరిశ్రమకు రాబోయే రోజులు ఇంతకన్నా గొప్పగా ఉండబోతున్నాయి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి