iDreamPost

ఈ ఫోటోలోని అబ్బాయిని గుర్తు పట్టారా? ఒక్క మూవీతో దేశాన్ని ఊపేశాడు..

ఈ ఫోటోలో పిల్లాడిని చూశారు కదా.. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. చిన్నప్పటి నుండే నాటకాలపై మక్కువ పెంచుకున్న ఈ నటుడు..

ఈ ఫోటోలో పిల్లాడిని చూశారు కదా.. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. చిన్నప్పటి నుండే నాటకాలపై మక్కువ పెంచుకున్న ఈ నటుడు..

ఈ ఫోటోలోని అబ్బాయిని గుర్తు పట్టారా? ఒక్క మూవీతో దేశాన్ని ఊపేశాడు..

నాటకాల పిచ్చి చాలా మందిని సినీ రంగానికి నడిపిస్తుంది. గత తరం కధానాయకుల నుండి ఈ తరం హీరోలు వరకు అనేక మంది నాటక రంగంలో రాణించినవారున్నారు. ప్రజా, జన నాట్య మండలి, సురభి వంటి వీధి, స్టేజీ నాటకాల్లో ప్రదర్శనలు ఇచ్చి ఆ తర్వాత వెండితెరపై సత్తా చాటేందుకు ఇటు వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ఇలా వెళ్లగానే ఇండస్ట్రీ రెడ్ కార్పెట్ పరవదు. తొలుత క్లాప్ బాయ్, స్పాట్ బాయ్, అసిస్టెంట్ డైరెక్టర్ ఇలా చిన్న చిన్న పనులు చేస్తూ.. ఆ తర్వాత తమ టార్గెట్ రీచ్ అవుతుంటారు. తెలుగులో నేచురల్ స్టార్ నాని ఇలా.. కింద స్థాయి నుండి హీరోకు ఎదిగిన వాడే. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న పిల్లాడు కూడా నాటక రంగం నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ఆ పై క్లాప్ బాయ్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసి హీరో అయ్యాడు.

నాటక రంగంలో అడుగులేసిన ఈ పిల్లగాడు ఆనాడు ఊహించి ఉండి ఉండడు.. తాను ఇంత పెద్ద హీరోని, డైరెక్టర్‌ను అవుతానని. తొలుత చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ నటుడు..దేశం గర్వించదగ్గ సినిమా తీశాడు. అతడి మూవీని ఏకంగా ఐక్య రాజ్య సమితిలో ప్రదర్శించారు కూడా. అతడు మల్టీ టాలెంటెడ్. యాక్టర్ మాత్రమే కాదు డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా. ఇంతకు ఆ పిల్లాడు ఎవరంటే.. కాంతారా మూవీతో పాన్ ఇండియా స్టారైన రిషబ్ శెట్టి. ఇది రిషబ్ చిన్నప్పటి పిక్. చిన్నప్పుడు నాటక రంగంలో యక్షగాన జానపద నృత్యాన్ని ప్రదర్శించినప్పటి ఫోటో ఇది. అందుకేనేమో కాంతారాలో పంజర్ల వేషధారణలో మెస్మరైజ్ చేశాడు. ఆరవ తరగతిలోనే ఈ నాటిక ప్రదర్శించి ఔరా అనిపించాడు. అతడి అసలు పేరు ప్రశాంత్ శెట్టి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక రిషబ్ శెట్టిగా మారింది.

దక్షిణ క న్నడ జిల్లాలోని మంగళూరుకు పొరుగు ఉన్న కద్రిలో జన్మించిన రిషబ్.. చిన్న వయస్సు నుండే నాటక రంగంలో రాణించాడు. డిగ్రీ పూర్తయ్యాక.. వాటర్ కాన్స్, రియల్ ఎస్టేట్ రంగంలో, హోటల్ రంగంలో పనిచేశాడు. ఆ తర్వాత ఫిల్మ్ డైరెక్టర్ కోర్సు చేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. క్లాప్ బాయ్, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తూ స్మాల్ రోల్స్ చేశాడు. తుగ్లక్ మూవీతో నటుడిగా మారిన రిషబ్.. రిక్కి సినిమాతో పూర్తి స్థాయి హీరో కం డైరెక్టర్ అయ్యాడు. కానీ అతడిని పాన్ ఇండియన్ స్టార్ చేసిన సినిమా 2022లో స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారతో. తొలుత కన్నడలో రిలీజ్ చేసి. ఆ తర్వాత అన్ని భాషల్లోకి విడుదల చేయడంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. పంజర్లీ పాత్రలో అతడు చేసిన యాక్టింగ్‪కు గూస్ బంప్స్ వచ్చాయి. ఈ సినిమా జాతీయ అంతర్జాతీయస్థాయిలో అవార్డులను గెలుచుకోవడమే కాదు.. 2023లో ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శించారు. ప్రస్తుతం కాంతారా 1లో నటిస్తున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి