iDreamPost

2010- 18 మధ్య ఆధార్ తీసుకున్న వారికి అలర్ట్.. ఇలా చేయాల్సిందే!

2010- 18 మధ్య ఆధార్ తీసుకున్న వారికి అలర్ట్.. ఇలా చేయాల్సిందే!

ఆధార్ అనేది భారత పౌరులకు తప్పనిసరి అని అందరికీ తెలిసిందే. ఇది లేకుండా మీకు ఎలాంటి పని కాదు. ప్రభుత్వ, ప్రైవేటు ఏ రంగానికి సంబంధించి పనులు కావాలి అన్నా మీకు ఆధార్ గుర్తింపు ఉండాల్సిందే. కేంద్ర ప్రభుత్వం 2010లో ఈ ప్రక్రియను ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి భారత పౌరుడు తమ పేరు మీద ఈ విశిష్ట గుర్తింపు సంఖ్యను తీసుకుంటున్నారు. ఇందులో మీ పేరు, చిరునామా, డేటాఫ్ బర్త్ మాత్రమే కాకుండా మీ వేలి ముద్రలను కూడా సేకరిస్తారు. అయితే ఇప్పుడు ఈ ఆధార్ కార్డు కలిగిన వారికి కేంద్ర ప్రభుత్వం కీలక అలర్ట్ జారీ చేసింది.

ఆధార్ కార్డులు తీసుకున్న కొత్తలో చాలామందికి ఎన్నో తప్పులు దొర్లాయి. అందుకు సంబంధించిన అందరు కార్డు హోల్డర్స్ వారి అవసరాలకు తగ్గట్లు వాటిని అప్ డేట్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరో అలర్ట్ ఏంటి అంటే ఆధార్ తీసుకుని పదేళ్లు గడిచిన వారికి అందరికీ అలర్ట్ జారీ చేశారు. అదేంటంటే పదేళ్లు దాటిన ఆధార్ కార్డులను తప్పనిసరిగా మళ్లీ అప్ డేట్ చేయించుకోవాలి. 2010 సమయంలో ఆధార్ కార్డులు జారీ చేసేటప్పుడు చాలా తప్పులు దొర్లాయి. అంతేకాకుండా చాలామంది తప్పుడు సమాచారం కూడా ఇచ్చారు.

ఇప్పుడు పదేళ్లు దాటిన ఆధార్ కార్డులను తప్పని సరిగా అప్ డేట్ చేయాలి అని చెబుతున్నారు. 2010- 2018 మధ్య ఆధార్ కార్డు తీసుకున్న వాళ్లంతా ఈ పని చేయాలి. నిజానికి ఈ పని చేసేందుకు కేంద్రం జూన్ 14 వరకు గడువు విధించారు. కానీ, పౌరుల నుంచి సరైన స్పందన రాలేదు. అందుకే ఆ గడువును మరో 3 నెలలు పొడిగించారు. అందులో ఇప్పటికే రెండు నెలలు పూర్తి అయ్యాయి. సెప్టెంబర్ 14 నాటికి ఉచితంగా ఆధార్ కార్డును రీ వెరిఫై చేసుకునేందుకు కేంద్ర గడువు ఇచ్చింది. ఈలోపు తప్పనిసరిగా పదేళ్లు దాటిన అందరూ ఆధార్ ని అప్ డేట్ చేసుకోవాలి. అందుకోసం కావాల్సిన పత్రాలు.. చదువుకున్న వారికి పదో తరగతి సర్టిఫికేట్ సరిపోతుంది.

పదో తరగతి సర్టిఫికేట్ కాకుండా.. ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, బ్యాంకు పాస్ పుస్తకం, పాస్ పోర్టు, ఉపాది హామీ జాబ్ కార్డ్, మ్యారేజీ సర్టిఫికేట్, తహసీల్దార్ జారీ చేసిన పత్రాలను మీరు అందజేయవచ్చు. ఈ ఆధార్ అప్ డేట్ ని మీరు ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు. అందుకు మై- ఆధార్ పోర్టల్, ఎం- ఆధార్ యాప్ ద్వారా సంబధిత ధ్రువ పత్రాలు సమర్పించి ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చు. మీరు ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఆధార్ కేంద్రాల్లో కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అయితే గడువులోపు మీరు ఆధార్ అప్ డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది అనేది మాత్రం చెప్పలేదు. బహుశా ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత రుసుము చెల్లించి ఆధార్ ని అప్ డేట్ చేసుకోవాల్సి రావచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి