iDreamPost

అన్నీ మాకే కావలి.. అది మాత్రం వద్దంటున్న కేశినేని నాని

అన్నీ మాకే కావలి.. అది మాత్రం వద్దంటున్న కేశినేని నాని

దేశ వ్యాప్తంగా కోవిడ్‌ వైరస్‌ కల్లోలం సృష్టిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ కొందరు రాజకీయ నేతలు ప్రాంతీయ విద్వేష రాజకీయాలు వీడడం లేదు. దేశమంతా కలసి కట్టుగా ముందుకు కదలాల్సిన స్థితిలో తమ ఛండాలపు రాజకీయాలతో ప్రజల్లో చులకన అవుతున్నారు. తాజాగా ఎంపీ కేశినేని నాని చేసిన ట్వీట్‌ దుమారం రేపుతోంది.

రాష్ట్రంలో కోవిడ్‌ వైరస్‌ను అరికట్టే ఉద్ధేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టింది. అన్ని వసతులతో ఆస్పత్రులను సైతం సిద్ధం చేసింది. పరిస్థితి మరింత ముదిరితే చికిత్స అందించడానికి వీలుగా విజయవాడలోని ఉన్న కొత్త ప్రభుత్వ ఆస్పత్రిని కరోనా వ్యాధిగ్రస్తులకు ఐసోలేషన్‌ వార్డులుగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే టీడీపీ ఎంపీ కేశినేని నాని మాత్రం విజయవాడలో ఐసోలేషన్‌ వార్డు పెట్టడం వల్ల ఇక్కడి వారికి వ్యాధి వస్తుందని, అందువల్ల ఇక్కడ పెట్టొద్దంటూ ట్వీట్‌ చేశారు. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
13 జిల్లాలకు చెందాల్సిన ఎన్నో విద్యా సంస్థలు, వైద్య సంస్థలు మాత్రం విజయవాడకు కావాలి. ఇప్పుడు పక్క జిల్లాల ప్రజలకు ఉపయోగపడే ఐసోలేషన్‌ వార్డులు మాత్రం వద్దా అని ప్రశ్నిస్తున్నారు.

రాజధాని, హైకోర్టు, శాసనసభలన్నీ విజయవాడకు దగ్గరలో కావాలి.. కానీ రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడే పనులు చేస్తుంటే మాత్రం ఒప్పుకోరా? అని నిలదీస్తున్నారు.

రాష్ట్రంలోని పార్టీల నేతలంతా కలసి కట్టుగా ముందుకు వెళ్లాల్సిన ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయడం ఎంత వరకు సబబని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆస్పత్రులు ఉన్నది రోగులకు సేవ చేయడానికేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కేశినేనికి సూచిస్తున్నారు. బాధ్యత గల పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం మంచిది కాదని పేర్కొంటున్నారు. నీచపు రాజకీయాలు మానుకోవాలని మండిపడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి