iDreamPost

Keerthy Suresh : వరస పొరపాట్లకు కీర్తి సురేష్ మూల్యం

Keerthy Suresh : వరస పొరపాట్లకు కీర్తి సురేష్ మూల్యం

నిన్న విడుదలైన గుడ్ లక్ సఖి ఫ్లాప్ రిపోర్ట్స్ తో పాటు బలహీనమైన ఓపెనింగ్స్ తో థియేటర్లలో అడుగు పెట్టింది. తనను ఐరన్ లెగ్ అంటున్నారని ఓ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ చెప్పిన మాట నిజం చేసేలా ఫలితం రావడం అభిమానులకు మింగుడు పడటం లేదు. కేవలం దర్శకుడి గత చరిత్ర చూసి సబ్జెక్టు గురించి ప్రాక్టికల్ గా ఆలోచించకుండా తప్పు మీద తప్పు చేస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. మహానటితో వచ్చిన ఇమేజ్ కాస్తా ఇప్పుడు తిరోగమనంలోకి పడిపోయింది. అప్పుడు వచ్చిన క్రేజ్ ఐసు ముక్కలా కరిగిపోవడం మొదలయ్యింది. కేవలం తనకోసమే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే సీన్ లేదని నిన్న క్లారిటీ వచ్చేసింది.

మహానటి తర్వాత కీర్తిసురేష్ కు ఒక్కటంటే ఒక్కటి పెద్ద సక్సెస్ తెలుగులో రాలేదు. డబ్బింగ్ చూసినా స్ట్రెయిట్ తీసుకున్నా ఫలితం అదే. సీమరాజా, స్వామి స్క్వేర్ లు డిజాస్టర్ కాగా పందెం కోడి 2, సర్కార్ లు తమిళంలో సేఫ్ అయ్యాయే తప్ప ఇక్కడ ముక్కిమూలిగి బ్రేక్ ఈవెన్ అందుకున్నాయి. డైరెక్ట్ ఓటిటిలో వచ్చిన పెంగ్విన్ ఫలితం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఇదే బాట పట్టిన మిస్ ఇండియా రిజల్ట్ కూడా ఇంతే. డిజిటల్ లోనూ జనం పూర్తిగా చూడలేకపోయారు. నితిన్ తో చేసిన రంగ్ దే సైతం సోసోనే. రజనీకాంత్ అన్నాతే. మోహన్ లాల్ మరక్కార్ లు మొదటి ఆటకే ఇవేం సినిమాలు బాబోయ్ అనిపించి తుస్సుమన్నాయి.

ఇక గుడ్ లక్ సఖి సంగతి ప్రత్యక్షంగా చూస్తున్నాం. రాబోయే వాటిలో చిరంజీవి భోళా శంకర్ లో చేస్తోంది చెల్లెలి పాత్ర కాబట్టి దాని మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవడానికి లేదు. సెల్వ రాఘవన్ తో చేసిన సాని కడియం డిఫరెంట్ జానర్ లో రూపొందింది. అది కూడా ఓటిటిలోనే రావోచ్చట. మలయాళంలో చేస్తున్న వాసి ఏం చేస్తుందో చూడాలి. ఉన్న ఆశలన్నీ మహేష్ బాబు సర్కారు వారి పాట మీదే పెట్టుకోవాలి. అది బ్లాక్ బస్టర్ అయ్యిందా మళ్ళీ స్టార్ హీరోల సరసన జోడి కట్టేందుకు అవకాశాలు వస్తాయి. లేదూ ఎన్ని ఫ్లాపులు వచ్చినా సరే పదే పదే ఫిమేల్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లే చేస్తానని కీర్తి అనుకుంటే ఆ కోరుకున్న బ్రేక్ ఎప్పుడు వస్తుందో మరి

Also Read : Aadavaallu Meeku Johaarlu : ఆడవాళ్ళ రాక వెనుక అసలు కారణం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి