iDreamPost

ప్రజా తీర్పును గౌరవించడమే ప్రజా స్వామం.. ప్రతిపక్షాలకు కేసీఆర్‌ హితవు

ప్రజా తీర్పును గౌరవించడమే ప్రజా స్వామం.. ప్రతిపక్షాలకు కేసీఆర్‌ హితవు

ఎన్నికల సమయంలో పార్టీలు అనేక ఆరోపణలు చేసుకుంటాయని, అయితే ప్రజా తీర్పు వెలువడిన తర్వాత దాన్ని అన్ని పార్టీలు గౌరవించడమే ప్రజాస్వామ్యమని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు(కేసీఆర్‌) వ్యాఖ్యానించారు. తెలంగాణ పురపాలక ఎన్నికల ఫలితాలపై ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా తీర్పును విమర్శిస్తే.. ఆయా పార్టీలను ప్రజలే మళ్లీ ఓడిస్తారని హెచ్చరించారు. డబ్బులిచ్చారు, ప్రజలు అమ్ముడుపోయారంటూ రకరకాల ఆరోపణలు చేసి ప్రజా తీర్పును అవహేళ చేయడం ప్రజాస్వామం కాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు. తెలంగాణాలో రాజకీయాలు చేయడం ఇతర పార్టీలకు గేమ్‌ అయితే.. తమకు ఒక పని అని వ్యాఖ్యానించారు.

Read Also: మున్సిపల్‌ ఎన్నికలు.. రేవంత్‌ రెడ్డికి మళ్లీ హ్యాండిచ్చారు

ఈ ఎన్నికల్లో తాము పార్టీ తరఫున 80 లక్షల విలువైన ప్రచార మెటీరియల్‌ మాత్రమే పంపామని చెప్పారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదని పేర్కొన్నారు. అయినా మాపై ఆరోపణలు చేయడం తగదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో తాము గెలిచామని, తమ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గెలించదన్న కేసీఆర్‌ అధికారం దుర్వినియోగం చేస్తే ఇది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఇందిరా గాంధీ, ఎన్టీఆర్‌ వేవ్‌కు మించి వరుస ఎన్నికల్లో తమ పార్టీని ప్రజలకు ఆదరించారని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని గుండెల్లో పెట్టుకుంటామన్న కేసీఆర్‌.. ఈ విజయాన్ని నేతలు గర్వంగా భావించకూడదని సూచించారు.

Read Also: పురపోరులో కారు జోరు

పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా త్వరలో ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ఎన్నికల హామీ అమలులో భాగంగా మార్చి నుంచి 57 ఏళ్లు దాటిన వారికి 2,116 చొప్పున పింఛన్‌ అందిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని కూడా త్వరలో పెంచుతామని తెలిపారు. పీఆర్‌సీని అమలు చేస్తామన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి