iDreamPost

KCR సర్కారు రాఖీ పండుగ గిఫ్ట్.. ఆ ఉద్యోగుల జీతాలు పెంపు!

  • Author singhj Published - 08:45 PM, Thu - 31 August 23
  • Author singhj Published - 08:45 PM, Thu - 31 August 23
KCR సర్కారు రాఖీ పండుగ గిఫ్ట్.. ఆ ఉద్యోగుల జీతాలు పెంపు!

తెలుగు రాష్ట్రాల్లోనే గాక మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలు రాఖీ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అక్కాచెల్లెళ్లు తమ అన్నాదమ్ములకు రాఖీలు కడుతున్నారు. ఆత్మీయ సోదరుల నుదుటన బొట్టుపెట్టి, హారతులు ఇచ్చి, మిఠాయిలు తినిపించి ఎల్లవేళలా తమకు రక్షగా ఉండాలని రక్షాబంధనం కట్టి పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. వారి కష్టసుఖాల్లో తాము తోడుగా ఉంటామని అన్నాదమ్ములు నిండు మనస్సుతో ఆశీర్వదించారు. ఈ ఆనంద సమయంలో తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

రాష్ట్రంలోని గ్రామ సంఘాల సహాయకుల (వీఓఏ)లకు రాఖీ పండుగ కానుకను అందించింది కేసీఆర్ సర్కారు. వీఓఏల జీతాలను రూ.3,900 నుంచి రూ.5,000కు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాక అదనపు సాయంగా రూ.3 వేలు కలిపి మొత్తంగా నెలకు రూ.8 వేల జీతాన్ని వీఓఏలు అందుకోనున్నారు. కేసీఆర్ సర్కారు తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని మొత్తం 17,608 మంది వీఓఏలకు లబ్ధి చేకూరనుంది. తమ వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వీఓఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జీతాలు పెంచుతూ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకోవడంతో వీఓఏలు సంతోషంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు మంత్రి హరీశ్​రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి.. కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే.. రెండ్రోజుల కిందే రాష్ట్రంలోని అర్చకులకు ధూప దీప నైవేద్యం పథకం కింద గౌరవ వేతనాన్ని పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. అర్చకుల వేతనాన్ని రూ.6 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ సర్కారు జీవో రిలీజ్ చేసింది. పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న రూ.6 వేల జీతాన్ని రూ.10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి