iDreamPost

కేసీఆర్‌ ఇలా.. జగన్‌ అలా.. వ్యత్యాసం ఇదే..

కేసీఆర్‌ ఇలా.. జగన్‌ అలా..  వ్యత్యాసం ఇదే..

ఇద్దరు ముఖ్యమంత్రులు.., రెండూ తెలుగు రాష్ట్రాలే.. కానీ పరిపాలనలో ఎంతో వ్యత్యాసం. ఒకరు ఉన్న చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు విప్లవాత్మకమైన చర్యలు చేపట్టగా మరొకరు కొంత మందికి లబ్ధి చేకూర్చేందుకు అదే చట్టానికి తూట్లు పొడిచారు. అదెలాగంటే…

మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్, కార్పొరేటర్‌గా పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా సరే పోటీ చేసేందుకు అర్హులని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటి వరకు పోటీకి దూరంగా ఉన్న నాయకులు తాజాగా జరగబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

1994లో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ పాలక సంస్థలకు రాజ్యంగబద్ధత కల్పించారు. ఈ సమయంలో చట్టం అమల్లోకి వచ్చిన 1994 తర్వాత ముగ్గురు పిల్లలున్న వారు పోటీకి అనర్హులని నిబంధన పెట్టారు. 73 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు కూడా రాజ్యాగబద్ధత కల్పించారు. పంచాయతీలకూ ఇదే షరతు విధించారు. ఫలితంగా 1994 తర్వాత ముగ్గురు పిల్లలు కలిగిన వారు పోటీకి దూరంగా ఉన్నారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఆ చట్టానికి తూట్లు పొడుస్తూ ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలున్న వారు కూడా పోటీ చేసేందుకు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించినట్లైంది.

ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం 1994 చట్టాన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మరింత సమర్థవంతంగా అమలు చేస్తోంది. చట్టంలో పంచాయతీలకు 29, మున్సిపాలిటీలకు 18 రకాల అధికారాలు , విధులు అప్పగించగా, అంతకు మించిన అధికారాలు, విధులు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ సిబ్బందిని నియమించి పరిపాలనా వికేంద్రికరణకు నాంధి పలికింది. స్థానిక సంస్థల పటిష్టానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు తీసుకున్న చర్యలు తెలంగాణలో స్థానిక సంస్థలను నష్టపరిచేదిగా ఉండగా, ఏపీలో మరింత బలపరిచేదిగా ఉండడం గమనార్హం.

కాగా, తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం తాజాగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. తెలంగాణలో 123 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. బీసీలకు 33 శాతం, ఎస్సీలకు 14, ఎస్టీలకు 3.2 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి