iDreamPost

కావేరీ ట్రావెల్స్ నిర్వాకం.. అద్దం లేని బస్సుతో HYDకు..!

ప్రభుత్వ బస్సులున్నా, మనం వెళ్లాలనుకున్న సమయానికి, అన్ ప్లాన్డ్ ప్రయాణానికి ఎక్కువ మంది ఆశ్రయించేది ప్రైవేట్ ట్రావెల్స్ నే. ఆర్టీసీ కన్నా డబ్బులు ఎక్కువ తీసుకుంటూనే.. భద్రతా ప్రమాణాలను గాలికొదిలేస్తున్నారు. ప్రయాణీకుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా

ప్రభుత్వ బస్సులున్నా, మనం వెళ్లాలనుకున్న సమయానికి, అన్ ప్లాన్డ్ ప్రయాణానికి ఎక్కువ మంది ఆశ్రయించేది ప్రైవేట్ ట్రావెల్స్ నే. ఆర్టీసీ కన్నా డబ్బులు ఎక్కువ తీసుకుంటూనే.. భద్రతా ప్రమాణాలను గాలికొదిలేస్తున్నారు. ప్రయాణీకుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా

కావేరీ ట్రావెల్స్ నిర్వాకం.. అద్దం లేని బస్సుతో HYDకు..!

పండుగ వస్తుంది వెంటనే స్వంత ఊళ్లకు వెళ్లిపోవాలంటే ఆశ్రయించేది బస్సు. అర్జెంట్ పని పడింది.. ఉరుకులు పరుగుల మీద వెళ్లాంటే ఎక్కేది బస్సునే. అయితే ప్రభుత్వ బస్సులు ఆ సమయంలో అందుబాటులో లేకపోతే.. వెంటనే ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయిస్తుంటారు ప్రయాణీకులు. గవర్నమెంట్ బస్సుల కన్నా డబుల్ ఛార్జీలు ఉన్నా.. తప్పని సరి పరిస్థితుల్లో వెళుతుంటారు. అయితే తీసుకున్న చార్జీలకు న్యాయం చేయడం లేదు ట్రావెల్స్. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, డ్రైవర్ మద్యం సేవించి బండి నడపడం, కండిషన్లో లేని బండ్లను రోడ్డపైకి తీసుకురావడం వంటి చర్యలు ప్రయాణీకుల జీవితాలను ప్రమాదంలో నెట్టేస్తూ ఉంటాయి. గతంలో నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ ట్రావెలర్స్ ప్రాణాలను బలిగొన్న ఘటనలు అనేకం ఉన్నాయి.

తాజాగా ఓ ప్రైవేట్ ట్రావెల్ నిర్వాకం ఒకటి వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. విశాఖ నుండి హైదరాబాద్ వెళ్లేందుకు పలువురు ప్రయాణీకులు కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ ను ఆశ్రయించారు. టికెట్లు కొన్నారు. అయితే కండిషన్‌లో లేని బస్సును ఏర్పాటు చేసింది యాజమాన్యం. దానికి ఎదురుగా అద్దం కూడా లేదు. బస్సు వచ్చేసిందన్న హడావుడిలో ఇవేమి గమనించకుండా ఎక్కేశారు ప్రయాణీకులు. అయితే బస్సు బయలు దేరగా, మార్గమధ్యలో విపరీతమైన చల్లటి గాలులు వస్తుండటంతో.. డ్రైవర్ వద్దకు వెళ్లి చూడగా.. అద్దం లేదని గుర్తించారు. వెంటనే ట్రావెల్ ఏజెన్సీకి ఫోన్ చేయగా.. అటు నుండి సరైన సమాధానం రాలేదు. ఇక ఆ చల్లగాలిని తట్టుకోలేక.. ప్రయాణీకులంతా బస్సును రాత్రి 11 గంటల సమయంలో నక్కపల్లి పోలీస్ స్టేషన్ వద్ద బలవంతంగా నిలిపివేవారు.

స్టేషన్‌లో ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు. యాజమాన్యానికి కాల్ చేస్తే.. సరైన రెస్పాన్స్ లేదని, ఇదే బస్సులో వెళ్లాలని ఒత్తిడి చేస్తుందని పేర్కొన్నారు. కావాలంటే ఆ బస్సు దిగిపోవాలని, టికెట్ డబ్బులు తర్వాత వాపస్ చేస్తామని, ప్రత్యామ్నాయంగా మరో బస్సు ఏర్పాటు చేసేది లేదని కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం పేర్కొందని ఆందోళన వ్యక్తం చేశారు. కిటీకీలకు సరైన అద్దాలు లేవని, డ్రైవర్ ఎదురుగా కూడా మిర్రర్ లేదని, తమ ప్రాణాలతో సదరు యాజమాన్యం చెలగాటమాడుతుందని మండిపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారని సమాచారం. ఇలా అరకొర సదుపాయాలతో ప్రయాణీకుల జీవితాలను పణంగా పెడుతున్న ఈ ప్రైవేట్ ట్రావెల్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి