iDreamPost

RRR : పునీత్ కోసం రాజమౌళి త్యాగం తప్పదా

RRR : పునీత్ కోసం రాజమౌళి త్యాగం తప్పదా

ఇప్పటికే నాలుగైదుసార్లు వాయిదా పడిన ఆర్ఆర్ఆర్ కొత్త విడుదల తేదీల కోసం రెండు డేట్లను లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి మార్చి 18. అయితే అప్పుడు కూడా వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. కారణం ఊహించనిదే ఉంది. మార్చి 17న దివంగత పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు. ఆయన చివరి చిత్రం జేమ్స్ ని ఆ రోజు రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ కు నివాళిగా ఆ వారం మొత్తం జేమ్స్ తో పాటు ఆయన సినిమాలు మాత్రమే కర్ణాటక థియేటర్లలో ప్రదర్శించాలని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకున్నారు. వేరే ఏ చిత్రాలను ఖచ్చితంగా వేసుకోరు.

ఇదే కనక జరిగితే మార్చి 18న ఆర్ఆర్ఆర్ రావడం అసాధ్యం. ఎందుకంటే దీనికి కర్ణాటక మార్కెట్ చాలా కీలకం. ఆంధ్ర తెలంగాణ తర్వాత భారీ ఓపెనింగ్స్ వచ్చేది అక్కడే. వారం రోజులు ఆలస్యంగా వదిలితే జరిగే డ్యామేజ్ మాములుగా ఉండదు. ఒకేసారి అన్ని భాషల్లో విడుదల చేస్తేనే ప్రాజెక్టు సేఫ్ అవుతుంది. పునీత్ కోసం అక్కడి ఎగ్జిబిటర్లు తీసుకున్న చర్యకు రాజమౌళి వెనుకడుగు వేయడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. పైగా పునీత్ అక్కడి వాళ్లకు ఒక హీరో కాదు. అంతకు మించిన ఎమోషన్. కాబట్టి వాళ్ళ భావోద్వేగాలను గౌరవించాల్సిందే. పైగా తను చరణ్ తారక్ లకు మంచి స్నేహితుడు కూడా. వాళ్ళూ అక్కడి డెసిషనే సమర్థిస్తారు.

ఈ లెక్కన ట్రిపులార్ ఏప్రిల్ 28 రావడం తప్ప వేరే మార్గం లేదు. ఒకరకంగా అదీ మంచిదే. అప్పటికంతా దేశవ్యాప్తంగా కేసులు పూర్తిగా తగ్గిపోయి పరిస్థితి సాధారణం అయ్యుంటుంది. థియేటర్లు నార్త్ తో సహా అన్ని చోట్లా వంద శాతం ఆక్యుపెన్సితో నడుపుతూ ఉంటారు. అదే సరైన సమయంగా భావించవచ్చు. కాకపోతే ఆ నెల విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో జక్కన్న టీమ్ కి ఇదంతా సులభంగా ఉండదు. పైగా ప్రమోషన్లను మళ్ళీ ఫ్రెష్ గా చేయాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు బాకీ ఉన్నాయి. ఏది ఏమైనా ఏ ముహూర్తంలో ఆర్ఆర్ఆర్ మొదలయ్యిందో కానీ ఇన్ని అవాంతరాలు మాత్రం ఎవరూ ఊహించనిది

Also Read : ATM : ఊపందుకుంటున్న వెబ్ సిరీస్ ట్రెండ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి