iDreamPost

మహిళలపై అత్యాచారం.. ప్రముఖ నటుడు అరెస్ట్‌!

మహిళలపై అత్యాచారం.. ప్రముఖ నటుడు అరెస్ట్‌!

మహిళపై అత్యాచారం చేశాడన్న ఆరోపణలతో ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత వీరేంద్ర బాబు అరెస్ట్‌ అయ్యారు. బాధిత మహిళపై అత్యాచారం చేయటమే కాకుండా.. వీడియో తీసి బెదిరింపులకు కూడా పాల్పడ్డాడన్న ఆరోపణలు సైతం అతడిపై ఉన్నాయి. 2021లో చోటుచేసుకున్న ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా వీరేంద్రను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, బాధిత మహిళ తన ఫిర్యాదులో తెలిపిన వివరాల మేరకు..వీరేంద్రబాబుకు నటుడిగా, నిర్మాతగా కన్నడనాట మంచి గుర్తింపు ఉంది. 2021లో ఆయన ఓ మహిళకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడు. అత్యాచారం చేయటమే కాదు..

ఆ దృశ్యాలను వీడియో కూడా తీశాడు. తర్వాత ఆ వీడియోను అడ్డం పెట్టుకుని బ్లాక్‌ మెయిల్‌ చేయటం మొదలుపెట్టాడు. దాదాపు 15 లక్షల రూపాయలు డిమాండ్‌ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే వీడియో లీక్‌ చేస్తానంటూ బెదిరింపులకు సైతం పాల్పడ్డాడు. జులై 30న సైతం ఆమెపై బెదిరింపులకు దిగాడు. కారులో ఆమెను తీసుకెళ్లి తుపాకితో బెదిరించాడు. తర్వాత ఆమె ఒంటిపై ఉన్న నగల్ని దోచుకున్నాడు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. వీరేంద్ర బాబుపై కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా, కొడగులో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

అతడినుంచి వివరాలను సేకరిస్తున్నారు.  కాగా, వీరేంద్ర బాబుపై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. ఎలక్షన్‌ టిక్కెట్‌ ఇప్పిస్తానంటూ డబ్బు తీసుకుని వీరేంద్ర తమను మోసం చేశాడంటూ అతడిపై కొంతమంది కేసు పెట్టారు. దాదాపు 1.8 కోట్లు మోసం చేశాడంటూ పోలీసుల ఎదుట బాధితులు వాపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2022 జులై నెలలో వీరేంద్రను అరెస్ట్‌ చేశారు. మరి, మహిళపై అత్యాచారం కేసులో నటుడు వీరేంద్ర బాబు అరెస్ట్‌ కావటంపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి