iDreamPost

విక్రమ్ సక్సెస్ తో డైరెక్టర్‌కు ఖరీదైన కారు కొనిచ్చిన కమల్ హాసన్

విక్రమ్ సక్సెస్ తో డైరెక్టర్‌కు ఖరీదైన కారు కొనిచ్చిన కమల్ హాసన్

కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో సూర్య గెస్ట్ రోల్ లో తెరకెక్కిన భారీ మల్టీస్టారర్ సినిమా విక్రమ్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా కమల్ హాసన్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ లో దీనిని నిర్మించారు. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని ట్విస్ట్ లు ఎవరూ ఊహించలేదు. దీంతో ఈ సినిమా భారీ హిట్ అయింది.

ఇప్పటికే ఈ సినిమా 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లని కలెక్ట్ చేసింది. 200 కోట్లకు దూసుకెళ్తుంది. దీంతో కమల్ కి లోకేష్ భారీ హిట్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకులే కాక చాలా మంది ప్రముఖులు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా ఇంతటి భారీ విజయం సాధించినందుకు హీరో, నిర్మాత కమల్‌ హాసన్‌ డైరెక్టర్‌కు సర్‌ప్రైజింగ్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు.

ఓ ఖరీదైన లెక్సాస్‌ లగ్జరీ కారును డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌కు కమల్‌ బహుమతిగా ఇచ్చారు. కమల్‌ హాసన్‌ కారు కీని డైరెక్టర్‌కు అందిస్తున్న ఫొటో, కారుతో వీరిద్దరూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కారు ధర దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందని సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి