iDreamPost

Vijayashanti: లేడీ అమితాబ్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్​లో..!

లేడీ అమితాబ్ విజయశాంతికి ఉన్న అభిమాన గణం తెలిసిందే. పవర్​ఫుల్ యాక్టింగ్​తో కోట్లాది మంది అభిమానాన్ని ఆమె సంపాదించారు. అలాంటి విజయశాంతి సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

లేడీ అమితాబ్ విజయశాంతికి ఉన్న అభిమాన గణం తెలిసిందే. పవర్​ఫుల్ యాక్టింగ్​తో కోట్లాది మంది అభిమానాన్ని ఆమె సంపాదించారు. అలాంటి విజయశాంతి సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.

Vijayashanti: లేడీ అమితాబ్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్​లో..!

చాలా కాలం రాజకీయ రంగంలోనే గడిపి.. ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి భారీ ప్రాజెక్టుతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చారు లేడీ అమితాబ్ విజయశాంతి. సూపర్​స్టార్ మహేష్ బాబు కాంబినేషన్​లో ఎవరు చేయాలి ఆ క్యారెక్టర్, ఎవరు చేస్తే సినిమాకి వెయిట్ వస్తుంది అనే చర్చ సుదీర్ఘంగా జరిగిన తర్వాత విజయశాంతి లాంటి పవర్ఫుల్ స్టార్ అయితేనే కథకి న్యాయం జరుగుతుందని నమ్మిన దర్శకుడు అనిల్ రావిపూడి ఆ స్టోరీని లేడీ అమితాబ్​కు చెప్పాడు. ఆమె సూచనల మేరకు కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకొని మరీ షూటింగ్​కు రెడీ అయ్యాడు.. సూపర్ హిట్ కొట్టాడు. దాదాపు రెండేళ్ల పాటు కథని రాసుకోవడం, ఆమెతో చర్చిండం.. ఇలా సాగింది. అలాగే ఇప్పుడు ప్రదీప్ చిల్కూరి ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసుకుని లేడీ అమితాబ్​ను సంప్రదించాడు.

ప్రదీప్ చిల్కూరి చెప్పిన కథ విన్న తర్వాత తన పాత్రకు సంబంధించి, తన సూచనల మేరకు సవరణలు చేయమని చెప్పారట విజయశాంతి. దీంతో ప్రదీప్ అందుకు అనుగుణంగా కథని పూర్తిగా ఆమె స్ట్రాంగ్ ఇమేజ్ కి తగినట్టుగా తయారు చేశాడు. ఇందులో ఆమె చాలా స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ చెబుతున్నారు. గతంలో ఆమె బాలీవుడ్​ను కూడా షాక్​కు గురిచేసిన తిరుగులేని పెర్ఫార్మెన్స్​కు గొప్ప ఇమేజ్​ను సంపాదించుకొని లేడీ అమితాబ్ అన్న టైటిల్​ను కూడా కైవసం చేసుకున్న పాత్రల కోవకే ఇప్పుడీ పాత్ర కూడా చెందుతుందని విశ్లేషిస్తున్నారు.

ఆ పాత్ర గెటప్, ఆ స్టైల్ విజయశాంతికి బాగా అచ్చొచ్చినదని కూడా చెబుతున్నారు. ఇంతకీ ఆ పాత్ర ఏమిటన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ వ్యక్తిగతంగా వెరీ స్పెషల్ స్క్రిప్ట్స్​ను మాత్రమే ఏరికోరి ఎంపిక చేసుకుంటారు. ఈ కథ కూడా అదిరిపోతుందని డైరెక్షన్ డిపార్ట్​మెంట్ చాలా ఎక్సైట్​మెంట్​తో ఉండటం విశేషం. అందుకే మేకింగ్ బడ్జెట్ కూడా నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాల్లోనే అత్యధిక బడ్జెట్ చిత్రం అవుతుందన్నది ఒక అంచనా. హయ్యెస్ట్ టెక్నికల్ వేల్యూస్​తో టోటల్ డిఫరెంట్ సినిమానే నందమూరి కళ్యాణ్ రామ్ ప్లాన్ చేసుకొని ముందడుగు వేస్తున్నారు.

రాజకీయాల్లో బిజీగా ఉండి చాలా కాలం సినిమాల వైపే తిరిగిచూడని విజయశాంతి.. కేవలం కథని మెచ్చకొని ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి సైన్ చేశారు. పైగా మహేష్ బాబు చిన్ననాడే తనతో కలసి నటించిన సెంటిమెంటుని కూడా ఆమె గౌరవించి ‘సరిలేరు నీకెవ్వరు’ చేయడం జరిగింది. ఇది బ్లాక్​బస్టర్ అయ్యాక ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా విజయశాంతి చేయడానికి అంగీకరించలేదు. ఇప్పుడీ కథని ఎందుకు ఓకే చేశారు అన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్. మరి.. విజయశాంతి రీఎంట్రీ మూవీ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: రోడ్డుపై చెత్త సేకరిస్తున్న తెలుగు యాంకర్! కారణం ఏమిటంటే?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి