iDreamPost

కల్కీ సినిమా విడుదల.. ఆ సెంటిమెంట్‌ రిపీట్‌!

కల్కీ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇక, ఈ సినిమా విడుదల విషయంలో నిర్మాణ సంస్థ ఓ సెంటిమెంట్‌ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

కల్కీ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇక, ఈ సినిమా విడుదల విషయంలో నిర్మాణ సంస్థ ఓ సెంటిమెంట్‌ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

కల్కీ సినిమా విడుదల.. ఆ సెంటిమెంట్‌ రిపీట్‌!

ప్యాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ప్యాన్‌ వరల్డ్‌ లెవెల్‌లో ‘ కల్కీ 2898 ఏడీ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జంటగా దీపికా పదుకునే నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దిశా పఠానీ, పశుపతి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది.

ఇక, ఈ సినిమాను ప్రముఖ టాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ తెరకెక్కిస్తోంది. దాదాపు 600 కోట్ల రూపాయలతో మూవీ నిర్మితమవుతోంది. మరికొన్ని నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మే9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు శుక్రవారం అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. ఇక, కల్కీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. అయితే, ఈ మూవీ విడుదల విషయంలో వైజయంతి మూవీస్‌ ఓ సెంటి మెంట్‌ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

prabhas kalki sentiment

వైజయంతి మూవీస్‌ తెరకెక్కించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా 1990 మే 9న విడుదల అయింది. చిరంజీవి నటించిన ఈ మూవీ తెలుగు నాట సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్‌ చేసింది. చిరంజీవితో పాటు వైజయంతి మూవీస్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ చిత్రంగా నిలిచింది. చాలా ఏళ్ల తర్వాత వైజయంతి మూవీస్‌ ‘మహానటి’ సినిమాతో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ను అందుకుంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ కూడా మే9వ తేదీనే విడుదల అవుతోంది.

ఇప్పుడు కల్కీ సినిమా కూడా మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని బట్టి చూస్తే.. వైజయంతి మూవీస్‌ మే9 సెంటిమెంట్‌ను నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అయినా.. కాకపోయినా.. కల్కీ సినిమా మాత్రం బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అవుతుందని చెప్పొచ్చు.. ఇప్పటికే మూవీనుంచి వచ్చి ప్రతీ అప్‌డేట్‌ బ్రహ్మాండంగా ఉంది. హాలీవుడ్‌ సినిమాతో పోటీ పడేలా సీన్లు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే.. కల్కీ 2వేల కోట్ల మార్కును ఇట్టే చేరుకుంటుంది.

కాగా, నాగ్‌ అశ్విన్‌ ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా మారారు. మహానటితో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అందుకున్నారు. ఇప్పుడు కల్కీతో ప్రపంచం మొత్తం తనవైపు  తిరిగి చూసేలా చేసుకోబోతున్నారు. మరి, వైజయంతి మూవీస్‌ కల్కీ విడుదల విషయంలో ఆ సెంటిమెంట్‌ ఫాలో అవుతోందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి