iDreamPost

కల్కిలో ప్రభాస్ పేరు రివీల్.. పేరులోనే ఇంత పవర్ అంటే సినిమాలో..!

Kalki Prabhas Name Revealed: మోస్ట్ హైప్డ్ చిత్రం కల్కి 2898 ఏడీ నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఇది చూసిన తర్వాత కల్కి సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేసింది.

Kalki Prabhas Name Revealed: మోస్ట్ హైప్డ్ చిత్రం కల్కి 2898 ఏడీ నుంచి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఇది చూసిన తర్వాత కల్కి సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ లో అంచనాలు పెంచేసింది.

కల్కిలో ప్రభాస్ పేరు రివీల్.. పేరులోనే ఇంత పవర్ అంటే సినిమాలో..!

కల్కి 2898 ఏడీ.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గురించి పెద్దఎత్తున బజ్ ఉంది. టాలీవుడ్ సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తున్న సినిమా. ప్రపంచ వేదికపై మన సినిమాకి ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చిన సినిమా. అలాగే మన తెలుగు సినిమాకి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకు రాబోతున్న సినిమా. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచాన్ని మనవైపు తిప్పినా కూడా.. కాన్సెప్ట్ మాత్రం రీజనల్ గానే ఉంది. కానీ, కల్కి మాత్రం సూపర్ హీరో సైన్స్ ఫిక్షన్ గా పాన్ వరల్డ్ ఆడియన్స్ ని ఎంగేంజ్ చేసే కాన్సెప్ట్ తో రాబోతోంది. అది కూడా మన పురాణ, ఇతిహాసాల నేపథ్యంలో ఉండటం మరో గర్వించే అంశం. ఇప్పుడు ఈ మూవీలో ప్రభాస్ పాత్ర పేరును రివీల్ చేశారు.

కల్కి 2898 ఏడీ సినిమాకి సంబంధించి ఇప్పటికే చాలా అప్ డేట్స్ వచ్చాయి. ప్రపంచ వేదికపై టైటిల్ గ్లింప్స్ రివీల్ చేశారు. ఆ తర్వాత సినిమా కాన్సెప్ట్ ఎలా ఉంటుందో క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతున్న విషయాన్ని చెప్పారు. ఈ మూవీలో ఎంతో గొప్ప స్టార్ కాస్ట్ ఉంది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే, కమల్ హాసన్ వంటి స్టార్లు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు గెస్ట్ రోల్స్ ఉంటాయి అంటున్నారు. ఇన్ని అప్ డేట్స్ తో కల్కి సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవల్ కి వెళ్లాయి.

ఇప్పుడు వచ్చిన అప్ డేట్ మాత్రం అంతకు మించి అనే చెప్పాలి. అదేంటంటే.. కల్కి సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పేరును రివీల్ చేశారు. ఈ పేరును బట్టి ప్రభాస్ పాత్ర ఎలా ఉండబోతోందో చెప్పచ్చు. ఇది ఫ్యూచర్ సినిమా అని అందరికీ తెలిసిందే. కానీ, ఇతిహాసాల నేపథ్యం కాబట్టి.. దానికి తనగినట్లుగానే ప్రభాస్ పేరుని ‘భైరవ’గా పెట్టారు. ఇప్పుడు ఈ పేరు విన్న తర్వాత ప్రభాస్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో చెప్పేయచ్చు. కాల భైరవుడి పేరుని ప్రభాస్ పాత్రకు పెట్టారు అంటే.. సినిమాలో పాత్రకూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటుందని చెప్పచ్చు. ఇంక లుక్స్ కూడా ఎంతో ఫ్యూచరిస్టిక్ గా, స్టైలిష్ గా ఉన్నాయి.

ఇప్పటివరకు వచ్చిన అప్ డేట్స్ ని బట్టి చూస్తే.. కల్కి సినిమా స్టోరీ చూస్తే 6000 వేల సంవత్సరాల క్రితం ముగిసిన కథ.. 2898 ఏడీలో మళ్లీ ప్రారంభం అవుతుంది. ఇతిహాసాలను, అందులోని పాత్రలను అదే ఇన్ టెన్సిటీతో చూపించబోతున్నారు. అప్పటి పోరాటాలను, అప్పటి ప్రతీకారాలను ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్లో చూపించబోతున్నారు. ఇందులో అంతా ఫ్యూచర్ టెక్నాలజీతోనే ఉంటుంది. పైగా వరల్డ్ క్లాస్ ఫ్యాన్స్ ని కనెక్ట్ చేసే విధంగా ఉంటుంది. మరి.. కల్కి 2898 ఏడీ మూవీలో ప్రభాస్ క్యారెక్టర్ పేరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి