iDreamPost

Super Star & Mega Star : చిరంజీవి రజనీకాంత్ స్నేహితులుగా సినిమా – Nostalgia

Super Star & Mega Star : చిరంజీవి రజనీకాంత్ స్నేహితులుగా సినిమా – Nostalgia

సౌత్ ఇండియన్ మెగాస్టార్స్ సూపర్ స్టార్స్ గా కోట్లాది ప్రేక్షకుల అభిమానం సొంతం చేసుకున్న చిరంజీవి రజినీకాంత్ మల్టీ స్టారర్ కాంబినేషన్ ఇప్పుడంటే అంచనాల బరువు, కథల కరువులో ఊహించలేం కానీ 80 దశకంలో ఇది రెండుసార్లు సాధ్యమయ్యింది. అందులో మొదటిది కాళి. ఆ విశేషాలు చూద్దాం. 1980 సంవత్సరం. చిరు కెరీర్ అప్పటికి ఊపందుకోలేదు. మంచి వేషాలు వస్తున్నాయి కానీ సోలో హీరోగా నిలదొక్కుకునేందుకు బాగా కష్టపడుతున్న సమయం. కమల్ హాసన్ తో ‘గురు’ లాంటి సక్సెస్ ఫుల్ మూవీ తీసిన ఐవి శశి దర్శకత్వంలో సుజాత ఫిలింస్ లిమిటెడ్ సంస్థ భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేసుకుంది. అందులో రజినీకాంత్ హీరో.

అతని స్నేహితుడిగా సెకండ్ హీరోగా కనిపించే పాత్రను చిరంజీవికి ఆఫర్ చేశారు. తమిళ వెర్షన్ లో ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్ ఆ క్యారెక్టర్ ని చేశారు. సినిమా స్కోప్ లో ఖర్చుకు వెనకాడకుండా షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. టైటిల్ రోల్ రజినిదే. తన చెల్లెలి కుటుంబం నాశనం కావడానికి కారణమైన దుర్మార్గాల అంతం చూసేందుకు కంకణం కట్టుకున్న కాళీ కథే ఈ సినిమా. మెయిన్ విలన్ గా సత్యనారాయణ చేశారు. ఇళయరాజా సంగీతం అందించగా అశోక్ కుమార్ ఛాయాగ్రహణం సమకూర్చారు. ఈయనకు అసిస్టెంట్ గా ఆ టైంలో ఇంకా హీరోయిన్ కాని సుహాసిని పని చేయడం గమనార్హం. అప్పట్లో పాతిక లక్షల బడ్జెట్ అంటే రికార్డు.

కాళిలో మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. చిరు రజినిలు ఫస్ట్ హాఫ్ లో తలపడే ఫైట్లు మాస్ కి బాగా ఎక్కేశాయి. క్లైమాక్స్ ని పెద్ద కోళ్ల ఫారంలో చిత్రీకరించిన తీరు ప్రింట్ మీడియా సంచలనం. డ్యూయల్ రోల్ లో సీమ గ్లామర్ మంచి ఆకర్షణగా నిలిచింది. ఆవిడే తర్వాతి రోజుల్లో ఐవి శశి సతీమణి కావడం విశేషం. 1980 సెప్టెంబర్ 19న చిరంజీవి మరో సినిమా ‘తాతయ్య ప్రేమలీలలు’తో పాటు కాళి విడుదలై ఘనవిజయం సొంతం చేసుకుంది. మంటలు, వందల గుర్రాలు, నదీ ప్రాంతంలో షూట్ చేసిన క్లైమాక్స్ లో చిరంజీవి పాత్ర చనిపోవడం ట్రాజెడీ మలుపు. చిరు రజని తర్వాతి కాలంలో మరో సినిమా కలిసి చేశారు. అది రాణువ వీరన్. ఆ కబుర్లు త్వరలో

Also Read : ప్లాస్టిక్ సర్జరీ మీద వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి