iDreamPost

Pavala Syamala: అత్యంత దీన స్థితిలో పావలా శ్యామల.. ఆదుకున్న కాదంబరి సాయం

  • Published Jan 05, 2024 | 9:25 AMUpdated Jan 05, 2024 | 9:25 AM

సీనియర్ నటి పావలా శ్యామల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెకు ఆర్థిక సాయం చేశారు నటుడు కాదంబరి కిరణ్. ఆ వివరాలు..

సీనియర్ నటి పావలా శ్యామల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెకు ఆర్థిక సాయం చేశారు నటుడు కాదంబరి కిరణ్. ఆ వివరాలు..

  • Published Jan 05, 2024 | 9:25 AMUpdated Jan 05, 2024 | 9:25 AM
Pavala Syamala: అత్యంత దీన స్థితిలో పావలా శ్యామల.. ఆదుకున్న కాదంబరి సాయం

సీనియర్ నటి పావలా శ్యామల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వందల చిత్రాల్లో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం వయసు మీద పడటంతో.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక.. చేతిలో డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాక గతంలో సినిమాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని.. తన కుమార్తె అనారోగ్యం చికిత్సకు ఖర్చు చేశారు. దాంతో తన చేతిలో చిల్ల గవ్వ లేదని.. ఆదుకోవాలని వాపోయారు.

అవకాశాలు లేక  ఆర్థికంగా ఇబ్బంది పడడమే కాకుండా మరోవైపు మంచాన పడిన కూతురు కూడా ఉండటంతో ఆమె మందుల కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలా ఎన్నో ఆర్థిక ఇబ్బందులు తనని చుట్టుముడుతున్నటువంటి తరుణంలో ఎవరైనా దాతల సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో గతంలో మెగాస్టార్ చిరంజీవి పావలా శ్యామలకు దాదాపు రెండు లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే.

pawala shyamala

ప్రస్తుతం శ్యామల పరిస్థితి మరితం దయనీయంగా ఉంది. మంచం దిగలేని పరిస్థితికి చేరుకున్నారు. దాతలెవరైనా తనను ఆదుకోవాలని కోరారు. ఈ క్రమంలో పావలా శ్యామల పరిస్థితి తెలుసుకున్న నటుడు కాదంబరి కిరణ్ ఆమెకు ఆర్థిక సాయం అందజేశారు. కాదంబరి కిరణ్ నటుడిగా మాత్రమే కాకుండా మనం సైతం అనే ఫౌండేషన్ నిర్వాహకులుగా కూడా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్యామల పరిస్థితి తెలుసుకున్న ఆయన.. ఆర్థిక సాయం చేశారు.

ఇక హైదరాబాద్ శివారులో ఒక వృద్ధాశ్రమంలో ఉంటున్న శ్యామలను వెతుక్కుంటూ వెళ్లి మరీ ఆమెకు ఆర్థిక సాయం అందజేశారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న శ్యామలకు 25వేల రూపాయల చెక్కు అందజేశారు. కాదంబరి కిరణ్ నడిపిస్తున్నటువంటి మనం సైతం అనే ఫౌండేషన్ సినీ ఇండస్ట్రీలో పేద కార్మికులకు సహాయం చేయడానికి స్థాపించారు. ఈ ఫౌండేషన్ గత పది సంవత్సరాలగా ఆర్థికంగా చితికిపోయిన సినీ కార్మికులను ఆదుకుంటుంది. ఈ సంస్థ సుమారు దశాబ్దం పైగా నిర్విరామంగా సేవలు కొనసాగించడం విశేషం. కాదంబరి కిరణ్ చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి