iDreamPost

Jr. NTR: ‘దేవర’ ధమాకా.. భారీ స్థాయిలో ఓవర్సిస్ బిజినెస్! ఇదీ తారక్ రేంజ్

దేవర చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఇదీ తారక్ రేంజ్ అంటూ గల్లా ఎగరేస్తున్నారు ఫ్యాన్స్.

దేవర చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఇదీ తారక్ రేంజ్ అంటూ గల్లా ఎగరేస్తున్నారు ఫ్యాన్స్.

Jr. NTR: ‘దేవర’ ధమాకా.. భారీ స్థాయిలో ఓవర్సిస్ బిజినెస్! ఇదీ తారక్ రేంజ్

‘దేవర’ యంగ్ టైగర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉంది. ఇక దేవర గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే వస్తోంది చిత్ర యూనిట్. రెండు పార్ట్ లుగా తెరకెక్కుతున్న ఈ మూవీ తొలి పార్ట్ ను ఏప్రిల్ 5న విడుదల చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. కానీ విడుదల తేదీ మారిందని నెట్టింట వార్తలు వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా.. దేవర చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. భారీ స్థాయిలో ఓవర్సిస్ బిజినెస్ సాధించాడు యంగ్ టైగర్. దీంతో ఇదీ తారక్ రేంజ్ అంటూ గల్లా ఎగరేస్తున్నారు ఫ్యాన్స్.

కోస్టల్ బ్యాగ్ డ్రాప్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో హై రేంజ్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. సైఫ్ అలీఖాన్ విలన్ గా, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతన్న ఈ మూవీపై భారీ అంచనాలను ఉన్నాయి. ఇక ఈ చిత్రం గురించి అప్డేట్స్ ఇస్తూ.. ఆ అంచనాలను మరింతగా పెంచేస్తున్నారు మేకర్స్. తాజాగా దేవరకు సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఓవర్సిస్ లో దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగిందని సమాచారం.

'Devara' is a big business

పరిశ్రమ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. దేవర మూవీకి ఓవర్సిస్ లో రూ. 27 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఈ లెక్కలు ఒక్కసారిగా ఇండస్ట్రీని షేక్ చేశాయి. దీంతో ఇదీ సర్ మా తారక్ అన్న రేంజ్ అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 27 కోట్ల బిజినెస్ అంటే మామూలు విషయం కాదు. ఆర్ఆర్ఆర్ మూవీతో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను సంపాదించుకున్నాడు తారక్. ఈ చిత్రం తర్వాత తారక్ నుంచి వస్తున్న నెక్ట్స్ ఫిల్మ్ దేవర కావడంతో.. భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా భారీ కాస్టింగ్, రెండు పార్ట్ లుగా రావడం, కొరటాల శివ దర్శకత్వం లాంటి అన్ని అంశాలు చిత్రంపై హైప్ ను క్రియేట్ చేశాయి. ఈ అంచనాలకు మించి ఓవర్సిస్ లో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది దేవర.

ఇక ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సముద్రంలో దండయాత్ర చేస్తున్న యంగ్ టైగర్ ను చూసి ఫ్యాన్స్ కు పూనకాలు వచ్చాయి. ఇక ఇదిలా ఉండగా.. తొలి పార్ట్ ను ఏప్రిల్ 5న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ ఇప్పుడు ఈ డేట్ మారినట్లు వార్తలు వైరల్ గా మారాయి. దేవరను ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. మరి దేవర ఓవర్సిస్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ రేంజ్ లో జరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి