iDreamPost

ఓటమి భయంతో వర్షం రావాలని కోరుకుంటున్న ఆసీస్‌ బౌలర్‌!

  • Author singhj Updated - 03:54 PM, Sat - 22 July 23
  • Author singhj Updated - 03:54 PM, Sat - 22 July 23
ఓటమి భయంతో వర్షం రావాలని కోరుకుంటున్న ఆసీస్‌ బౌలర్‌!

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్​ మరింత రసవత్తరకంగా సాగుతోంది. తొలి రెండు టెస్టుల్లో గెలిచి కాలర్ ఎగరేసిన ఆస్ట్రేలియాకు మూడో టెస్టు నుంచి చుక్కలు చూపిస్తోంది ఇంగ్లండ్. బజ్​బాల్​ స్ట్రాటజీని వదలని ఇంగ్లీష్ టీమ్.. నాలుగు టెస్టులోనూ తమ జోరును కొనసాగిస్తోంది. దీంతో ఈ మ్యాచ్​పై ఆసీస్ ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కమిన్స్ సేన ఓటమి నుంచి తప్పించుకోవాలంటే ఇక అద్భుతమే జరగాలి. బెయిర్​ స్టో (99 నాటౌట్​), బ్రూక్ (61), కెప్టెన్‌ స్టోక్స్ (51) హాఫ్ సెంచరీలతో రాణించడంతో ఫస్ట్ ఇన్నింగ్స్​లో ఇంగ్లండ్ 275 రన్స్ ఆధిక్యం సాధించింది. ఓవర్​నైట్ స్కోరు 384/4తో బ్యాటింగ్​ను కొనసాగించిన స్టోక్స్ సేన.. 592 రన్స్​కు ఆలౌటైంది.

కంగారూ బౌలర్లలో జోష్ హేజల్​వుడ్ (2/126) విజృంభించాడు. అతడికి స్టార్క్, గ్రీన్ చెరో రెండు వికెట్లు తీసి చక్కటి సహకారం అందించారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా.. మూడో రోజు ఆట ముగిసేసరికి 113/4తో ఉంది. ఆ టీమ్ ఇంకా ఇంగ్లండ్ స్కోరుకు 162 రన్స్ వెనుకబడి ఉంది. గేమ్​లో ఇప్పుడు ఇంగ్లీష్ టీమ్​దే పైచేయి. కానీ నాలుగో రోజు, ఐదో రోజు ఆటలో వరుణుడు అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇదిలా ఉంటే.. ఈ టెస్టులో వర్షం పడాలని ఒక ఆసీస్ ప్లేయర్ కోరుకుంటున్నాడు. తమ జట్టు కష్టాల్లో ఉండటం, గెలుపు సంగతి పక్కనబెడితే.. ఓటమిని కూడా తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉండటంతో వరుణుడు తమను కరుణించాలని కోరుకుంటున్నాడు. అతడు మరెవరో కాదు స్పీడ్​స్టర్ హేజల్​వుడ్.

ఇంగ్లండ్​ను ఫస్ట్ ఇన్నింగ్స్​లో కట్టడి చేయడంలో ఈ పేసర్ బాగానే సక్సెస్ అయ్యాడు. 5 వికెట్లతో హేజల్​వుడ్ సత్తా చాటాడు. కానీ మిగతా బౌలర్లను టార్గెట్ చేసుకొని ఇంగ్లీష్ బ్యాట్స్​మెన్ విజృంభించారు. దొరికిన బాల్​ను దొరికినట్లు బౌండరీకి తరలించారు. దీంతో ఆ టీమ్​ ఫస్ట్ ఇన్నింగ్స్​లో భారీ ఆధిక్యం సంపాదించింది. ఈ సమయంలో బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్​ను ఇంగ్లండ్ పేసర్ మార్క్​వుడ్ (3/17) చావుదెబ్బ తీశాడు. షార్ట్ పిచ్ బంతులతో స్వల్ప వ్యవధిలో స్టీవ్ స్మిత్​, హెడ్​ (1)ను వెనక్కి పంపాడు. దీంతో ఆసీస్​ను గట్టెక్కించాల్సిన బాధ్యత మార్ష్ (1 బ్యాటింగ్), లబుషేన్ (44 బ్యాటింగ్)పై పడింది. ఈ నేపథ్యంలో వరుణడే తమను కాపాడాలని పేసర్ హేజల్​వుడ్ అంటున్నాడు. మ్యాచ్ జరుగుతున్న ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో వాన కురిస్తే తాను చాలా సంతోషిస్తానని అతడు తెలిపాడు. అయితే ఓటమి భయంతోనే హేజల్​వుడ్​ వర్షం పడాలని కోరుకుంటున్నాడని ఇంగ్లండ్ ఫ్యాన్స్ అతడ్ని ట్రోల్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి