iDreamPost

ఏపీలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు.. సంతోషం వ్యక్తం చేసిన JD

ఏపీలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు.. సంతోషం వ్యక్తం చేసిన JD

ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం అన్ని వర్గాలను ఆర్థికంగా బలపర్చేందుకు కొత్త కొత్త పథకాలు.. కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. దాదాపు 13 యూనిట్లకు సంబంధించి ఆయన ప్రారంభోత్సం, శంకుస్థాపన, ఎంవోయూలు చేశారు.

వీటిలో మూడికి ప్రారంభోత్సవం జరగ్గా.. తొమ్మిదిటికి శంకుస్థాపనలు, 1 దానికి ఎంఓయూ జరిగింది. 14 జిల్లాల్లో వస్తున్న పరిశ్రమల వల్ల 7 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఇక, ఈ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లపై జేడీ లక్ష్మీ నారాయణ తాజాగా స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో గురువారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ‘‘ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు చొరవ తీసుకోవటం సంతోషంగా ఉంది. ఈ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల వల్ల రైతులకు ఎంతో మేలు జరగనుంది.

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.. వలసలు కూడా తగ్గుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటివి మరిన్ని రావాలి’’ అంటూ ముఖ్యమంత్రి సీఎం జగన్‌, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌లను ట్యాగ్‌ చేస్తూ కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు చేయటంపై జేడీ లక్ష్మీ నారాయణ స్పందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి