iDreamPost

VIDEO: బూమ్‌ బూమ్‌ బుమ్రా! రీఎంట్రీ తర్వాత తొలి ఓవర్‌లోనే నిప్పులు చెరిగాడు

  • Published Aug 18, 2023 | 7:55 PMUpdated Aug 18, 2023 | 8:50 PM
  • Published Aug 18, 2023 | 7:55 PMUpdated Aug 18, 2023 | 8:50 PM
VIDEO: బూమ్‌ బూమ్‌ బుమ్రా! రీఎంట్రీ తర్వాత తొలి ఓవర్‌లోనే నిప్పులు చెరిగాడు

టీమిండియా స్టార్‌ బౌలర్‌, యార్కర్‌ కింగ్‌ జస్ప్రీత్‌ బుమ్రా చాలా కాలం తర్వాత గ్రౌండ్‌లోకి దిగాడు. దాదాపు ఏడాది క్రితం టీమిండియా తరఫున మ్యాచ్‌ ఆడిన బుమ్రా.. వెన్ను గాయంతో జట్టుకు దూరం అయ్యాడు. ఆ తర్వాత వెన్నుముకకు సర్జరీ చేయించుకుని, గాయం నుంచి కోలుకుని.. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌తో తిరిగి ట్రాక్‌ ఎక్కాడు. ప్రస్తుతం డబ్లిన్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో తొలి ఓవర్‌ వేసిన బుమ్రా.. నిప్పులు చెరిగాడు. బుమ్రా వేగం, స్వింగ్‌, యార్కర్‌ స్టామినా ఏంటో.. తొలి ఓవర్‌లేనే ఐరిష్‌ బ్యాటర్లు రుచిచూశారు.

తొలి ఓవర్‌ తొలి బంతిని సాధారణంగా బ్యాట్‌పై ఇచ్చిన బుమ్రా.. ఫస్ట్‌ బాల్‌కు బౌండరీ బాదించుకున్నాడు. కానీ, రెండో బంతికి ఆండ్రూ బల్బిర్నీ(4)ని బౌల్డ్‌ చేశాడు. ఐదో బంతికి లోర్కాన్ టక్కర్(0)ను అవుట్‌ చేశాడు. టక్కర్‌ క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇలా చాలా కాలం తర్వాత బౌలింగ్‌ వేస్తున్న బుమ్రా.. వేసిన తొలి ఓవర్‌లోనే కేవలం 4 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకుని.. ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తొలి ఓవర్‌లో టక్కర్‌కు వేసిన ఒక యార్కర్‌తో మాత్రం బుమ్రా ఇజ్‌ బ్యాక్‌ అనిపించాడు. తొలి ఓవర్‌లో బుమ్రా 130, 140 మధ్య​ వేగంతో బంతులేశాడు.

చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇవ్వడంతో నిదానంగా వేగం పెంచుతున్నాడు. అయితే. స్వింగ్‌, యార్కర్‌, లైన్‌ అండ్‌ లెంగ్త్‌ మాత్రం అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి. మరికొన్ని ఓవర్లు గడిస్తే.. బుమ్రా తన లయను పూర్తిగా అందుకుని.. పాత బూమ్‌ బూమ్‌ బుమ్రాను బయటికి తీసేలా కనిపిస్తున్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ బుమ్రా టాస్‌ గెలిచి, తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌తో రింకూ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ టీమిండియా తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. మరి ఈ మ్యాచ్‌లో బుమ్రా తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: విరాట్ వీర విహారానికి 15 ఏళ్ళు పూర్తి! ఆయన్ని ఎవడ్రా ఆపేది?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి