iDreamPost

అరెస్టు అయిన ఆ జనసైనికులకి అండగా ఉండం – జనసేన

అరెస్టు అయిన ఆ జనసైనికులకి అండగా ఉండం – జనసేన

వై.యస్ జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి తెలుగుదేశం, జనసేన పార్టీ మద్దతుదారులుగా చెప్పుకునే కొంత మంది సోషల్ మీడియా వేదికగా అసత్యాలను, అర్ధసత్యాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వం పై నిత్యం బురదజల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. కొంత మంది పరిధి దాటి నాయకులని నిత్యం అసభ్య పదజాలంతో దూషించడం. సమాజంలో కులం మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి అశాంతిని రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. విధాన పరంగా కాకుండా ఒక నిర్ధిష్ట ఎజండాతో ప్రభుత్వాన్ని ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ ని , ఇతర వైసీపీ నాయకులను దూషిస్తూ అసత్యాలను ప్రచారం చెసే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని వై.సి.పి పార్టీ అభిమానులు ,నాయకులు పోలీసులను కోరుతు వచ్చారు.

వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు , అభిమానుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సోషల్ మీడియా లో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే వారిని ఉపేక్షించబోమని చట్టపరంగా శిక్ష పడేలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ వద్దకు వచ్చిన ఫిర్యాదుల్లో ఉన్న వాస్తవాలను పూర్తిగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీని ఆదారంగా ముందుగా కర్నూలు ఆసుపత్రిలో జరిగిన ఒక ఘటనని చిలువలు పలువలు చేసి సమాజంలో మతాల మద్య అశాంతి రగిలేలా అలాగే ప్రభుత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పొస్టు పెట్టిన జనసేన అధికార ప్రతినిది కుసుంపూడి శ్రీనివాస్ పై వచ్చిన ఫిర్యాదు ఆదారంగా పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఇతను గతంలో కూడా ఇలాగే పలు అసత్యాలతో ప్రభుత్వం పై ముఖ్యంగా జగన్ పై కూడా తీవ్రమైన పదజాలం వాడటం విశేషం .

అయితే తాము నిజాయితీ , నిబద్ధత కలిగిన రాజకీయం చేస్తాం అని చెప్పుకునే జనసేన పార్టీ అధికార ప్రతినిదే ఇలా అసత్యాలు ప్రచారాం చేసిన కేసులో అరెస్ట్ అవ్వడంతో పవన్ కల్యాణ్ , జనసేన పార్టీలు ఒక్కసారిగా ఉలిక్కిపడి తక్షణం దిద్దుబాటు చర్యలకు దిగింది. అందులో బాగంగా ఈ అరెస్టులపై వివరణ ఇస్తు ఒక లేఖను జనసేన పార్టీ తమ నాయకుడు హరిప్రసాద్ పేరున విడుదల చేసింది. జనసేన పార్టీ తరుపున టి.వి చర్చల్లో మాట్లాడేవాళ్ళు , పత్రికా ప్రకటనలు చేసేవారు, ముఖ్యంగా పార్టీకి అండగా సోషల్ మీడియాలో పని చేసేవారు. కచ్చితమైన వార్త అని దృవీకరించుకున్న తరువాతే మాట్లాడాలని అలా కాకుండా అసత్యాలు ప్రచారం చేసి చట్టవ్యతిరేకమైన పనులకు పాల్పడి అరెస్టు ఐతే జనసేన పార్టీ అలాంటి వారికి అండగా నిలబడదు అని. పోస్టులు పెట్టేవాళ్ళు అద్యక్షుడు పవన్ కల్యాన్ గారి సూచనల మేరకే వ్యవహరించాలని , పార్టీ పేరుతో ఇష్టానుసారం మాట్లాడితే తమకు సంభందం లేదని అర్ధం వచ్చేలా లేఖలో పేర్కొన్నారు .

ఏది ఏమైనా సోషల్ మీడియాలో అసత్యాలను ప్రచారం చేసే వారిపై రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాక్ స్వాతంత్రం పేరుతో సమాజంలో వర్గాల మద్య అసత్యాలతో విద్వేషాలను పెoపొందించేలా వ్యవహరించే వారిని కట్టడి చేసి ప్రజలను భయాందోళనలకు గురి అవ్వకుండా చూడాలి. నేతల అండ చూసుకుని సోషల్ మీడియాలో అడ్డు అదుపు లేకుండా ఇష్టా రాజ్యంగా వ్యవహరించే వారు ఇప్పటికైనా అసత్యాలు ప్రచారం చేసే కేసులో ఇరుక్కుంటే తమ నాయకులు రక్షించలేరు అని పవన్ కళ్యాణ్ వాఖ్యలతోనైనా గుర్తెరగాలి . దురుద్దేశంతో అసత్యాలు ప్రచారం చేస్తే కటకటాలు పాలవ్వడం తధ్యం .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి