iDreamPost

Vangalapudi Anitha: TDP నేత అనితకు షాక్ ఇచ్చిన జనసేన నేతలు!

టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు జనసేన నేతలు బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేన నాయకుల ఇంటికి వెళ్లిన ఆమెకు వారు ఊహించిన షాకిచ్చినట్లు సమాచారం.

టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు జనసేన నేతలు బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా జనసేన నాయకుల ఇంటికి వెళ్లిన ఆమెకు వారు ఊహించిన షాకిచ్చినట్లు సమాచారం.

Vangalapudi Anitha: TDP నేత అనితకు షాక్ ఇచ్చిన జనసేన నేతలు!

టీడీపీ, జనసేన అధ్యక్షుల మధ్య పొత్తు ఉంది. కానీ, అది క్షేత్ర స్థాయిలో కనిపించడం లేదు. ముఖ్యంగా వీరి ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన నాటి నుంచి జనసేన నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేవలం 24 స్థానాల్లోనే పోటీ చేస్తున్నానని పవన్ కల్యాణ్ చెప్పడం జనసేన కార్యకర్తలను తీవ్ర వేదనకు గురి చేస్తుంది. చంద్రబాబుకు ఆదేశాల మేరకే పవన్ పని చేస్తున్నారనే వాదనలకు  ఈ సీట్లు బలం చేరుకుస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులకు జనసేన నేతలు గట్టి షాకులిస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా పాయకరావుపేట టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనితకు స్థానిక జనసేన లీడర్ల షాకిచ్చారు.

వంగలపూడి అనిత..టీడీపీలోని ముఖ్యనేతల్లో ఒకరు. 2014లో పాయకరావుపేట నుంచి  టీడీపీ తరపున పోటీ చేసి గెలుపు పొందారు. అనంతరం 2019లో కొవ్వురూ నుంచి పోటీ చేసి.. ఓటమి పాలయ్యారు. తాజాగా మరోసారి…తాను తొలిసారి గెలిచిన స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా అనిత బరిలో దిగుతున్నారు. ఇక చంద్రబాబు ఆదేశాల మేరకు స్థానిక నేతలను, జనసేన పార్టీ లీడర్లను కలుపుకుని పోయే ప్రయత్నం  చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజవర్గంలోని జనసేన నేతలను కలిసేందుకు సిద్ధమయ్యారు. పొత్తులో భాగంగా అనిత జనసేన నేతల ఇంటికి వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అయితే గతంలో ఆమె ఎమ్మెల్యేగా ఉండగా చేసిన పనులు జనసేన నాయకులు మర్చిపోలేదని తెలుస్తోంది. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమపై తప్పుడు కేసులు పెట్టి.. ఇబ్బందులకు గురి చేశారని జనసేన నేతలు అంటున్నారు. అలా తమను ఇబ్బంది పెట్టిన అనితను మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.

ఇలా కేవలం ఒక పాయకరావుపేట నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనిత మాదిరిగానే టీడీపీ నేతలు నిరసనలను ఎదుర్కొంటున్నారు. గతంలో వారు అధికారంలో ఉండగా..తమను చాలా దారుణంగా ఇబ్బందులకు గురి చేశారని పలు నియోజవర్గాలకు చెందిన జనసేన లీడర్లు వాపోతున్నారు. బయటకు పవన్ కల్యాణ్ మాట వింటామని చెబుతున్నప్పటికీ..లోపల మాత్రం టీడీపీ అభ్యర్థికి మద్దతు  ఇచ్చే ప్రసక్తే లేదన్నట్లు వారి వ్యవహారం ఉంది. రాష్ట్ర స్థాయిలో టీడీపీ,జనసేన మధ్య ఉండే స్నేహం, పొత్తు ధర్మం వేరు, క్షేత్ర స్థాయిలో వేరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు.

ఇరుపార్టీల అధ్యక్షులు కలిసినంత ఈజీగా క్షేత్ర స్థాయిలో ఇరు పార్టీల నేతలు కలవడం అనేది చాలా కష్టమని, అంతేకాక ఒకరినొకరు ఒడించాలనే కసితో లోలోపల రగిలిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా పొత్తు పెట్టుకున్నా కూడా తమకు ఈ తలనొప్పి తప్పడం లేదని పలువురు టీడీపీ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని టాక్. భీమవరంలో అయితే టీడీపీ నేతలు పవన్ కల్యాణ్ తీరుపై మండిపడ్డారు. తమను కనీసం పలకరించకుండా సభ నుంచి పవన్ వెళ్లిపోయారని స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ప్రకటించిన సీట్ల వ్యవహరం రచ్చ రచ్చగా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి