iDreamPost

కూలుతున్న జనసేన

కూలుతున్న జనసేన

గత ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత జనసేనపార్టీలో రాజీనామాల పర్వం ఊపందుకొంది. కార్యకర్తలతో మొదలైన రాజీనామాలు చివరికి పార్టీ వ్యవస్థాపకుల వరకూ చేరింది. ఎన్నికలలో 6శాతం ఓట్లకు మాత్రమే పరిమతమై అనేక చోట్ల డిపాజిట్లు కోల్పోయి జనసేన రోజు రోజుకి మరింత బలహీనపడుతుంది. పార్టీ నిర్మాణ లోపం , పవన్ కల్యాణ్ నాయకత్వ లోపం వెరసి జనసేనలో ఉండే ఒక్కక్క లీడర్ పవన్ ని వదిలి తమదారి వెతుక్కుంటున్నారు. చింతల పార్ధసారధి, ఆకుల సత్యనారాయణ, పసుపులేటి సుధాకర్, రావెల కిషొర్ బాబు, మారంశెట్టి రాఘవయ్య, పసుపులేటి రామారావు, అద్దేపల్లి శ్రీధర్ ఇలా కీలకంగా వ్యవ్హరించిన నేతలు ఒకరి తరువాత ఒకరు జనసేనను వదిలిపెట్టారు. ఇదిలా ఉంటే జనసేన పార్టీ స్థాపనలో , నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించి, పార్టీకి సిద్దాంతాలను, రాజ్యాంగాన్ని ఇజం రూపంలో తయ్యరు చెసిన పవన్ కళ్యాణ్ స్నేహితుడు అయిన రాజు రవితేజ జనసెన పార్టీకి రాజీనామ చేశారు.

జనసేన ఆవిర్భావం లో కీలక భూమిక పోషించిన రాజు రవితేజ పార్టీని వీడటం పార్టీకి కోలుకోలేని దెబ్బనే చెప్పాలి. జనసేన పార్టీకి భావజాలం , ఆ పార్టీ రాజ్యాంగం సృష్టించి పార్టీలో వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా ఉంటూ పార్టీకి అనేక సేవలు అందించిన అయన పార్టీకి రాజీనామా చేస్తూ పవన్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తాను ఇకపై పవన్ కల్యాణ్ తో లేదా జనసేన పార్టీతో కలిసి పని చేయాలని అనుకోవటంలేదని, తాను చాల రాజకీయ కార్యకలాపాలను చూశాను, అలాగే పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాలను కూడా చుశానని, పవన్ కళ్యాణ్ లో తనకి ఈ మధ్య నిజాయతీ కనిపించకపోగా మభ్యపెట్టే ధోరణి కనిపించిందని. అది తనకు అసహ్యంగా అనిపించిదని చెప్పుకొచ్చారు , అలాగే పవన్ కళ్యాణ్ లో ఈమధ్య పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకమైన కక్ష సాధింపు తనం, కులమత ద్వేషం రెచ్చగొట్టి వీటితో లక్షల మంది ప్రజల ఆలోచనలను విషపూరితం చెయ్యటం, ఒక వర్గానికి వ్యతిరేకంగా మరో వర్గాన్ని రెచ్చగొట్టటం చేస్తూ ప్రజల మధ్య శత్రుత్వాన్ని పెంచటం లాంటి పనులతో పవన్ కళ్యాణ్ నడిచే ప్రమాధకరమైన విభజన శక్తిగా మారిపోయాడని, పవన్ కల్యాణ్ ఇప్పుడున్న ఈ స్థితిలో రాజకీయ లేదా సామాజిక శక్తి ఉన్న పదవిని ఆక్రమించటానికి అనుమతించకూడదని, పవన్ కళ్యాణ్ ఎటువంటి రాజకీయ అధికారానికి అర్హుడు కాదని తీవ్రంగా దుయ్యబట్టారు.

రవితేజ చెప్పినట్టు ఈ మధ్య పవన్ కళ్యాణ్ తీరులో కాస్త విపరీత ధోరణలు కనిపిస్తున్నాయనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ ప్రవర్తన చూస్తే జగన్ గెలుపుని జీర్ణించుకోలేక తీవ్ర అసహనంతో ఎలా ప్రవర్తిస్తున్నాడో , ఏమి మాట్ళాడుతున్నాడో కూడా పవన్ కళ్యాణ్ కి తెలియటంలేదు. మా పార్టీ సిద్దాతం ప్రకారం కులాల ప్రస్తావన ఉండదు అంటూనే జగన్ నీది ఏ కులం నువ్వు రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నావు అని అసందర్భ మాటలు మాట్లాడారు, అలాగే మతాల ప్రస్తావన్ లేని రాజకీయం మా సిద్దాంతం అంటూ సెక్యులరిజాన్ని దెబ్బతీసుకుంది హిందువులే అని వివాదాస్పదమైన మాటలు మాట్లాడతారు. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ అంటే గౌరవం అంటూ రాజంగ్యం ప్రకారం గెలిచిన ముఖ్యమంత్రిని గుర్తించను అని జగన్ కి ఓట్లు వేసిన 50% మందిని కించపరుస్తూ మాట్లాడతారు. జగన్ మీద కోపం తో దళిత, మరియు స్త్రీ సభ్యులు ఉన్నారు అని కుడా చూడకుండా మీరెంత? మీ బ్రతుకులు ఎంత అని నోరు పారేసుకున్నారు, ఇదే మాట పట్టుకుని, స్పీకర్ కేసు వేస్తే పవన్ ని ఏ కోర్టూ కూడా కాపడలేదనే విషయం పవన్ కి తెలియదా?. ఈ ద్వంద విధానాలను విమర్శిస్తూనే నేడు పార్టీ సృష్టికర్తలలో ఒకరైన రాజ రవితేజ పార్టీ నుండి వెళ్ళిపోయారు. ఇదే బాటలో ఇంకా ఆ పార్టీలోనే అనేకమంది ఉన్నారు. గెలిచిన సభ్యులు రాపాక వరప్రసాద్ గారు కూడ పవన్ నిర్వహించిన సౌభాగ్య దీక్షకు వెళ్ళలేదు. జనసేనని భారతీయ జనతా పార్టీలో విలీనం చెస్తారని ఈ మధ్య ఉహాగానాలు రాజకీయ వర్గాలలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పొతే పార్టీ నిట్టనిలువునా కూలి మరో ప్రజారాజ్యం అవుతుందో లేక పునఃనిర్మాణం జరుగుతుందో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి