iDreamPost

తలైవా రజినీకాంత్ ‘జైలర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే!

  • Author singhj Published - 04:32 PM, Thu - 10 August 23
  • Author singhj Published - 04:32 PM, Thu - 10 August 23
తలైవా రజినీకాంత్ ‘జైలర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే!

తలైవా రజినీకాంత్ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘జైలర్’ మూవీ ఎట్టకేలకు వచ్చేసింది. రజినీ మేనియాతో థియేటర్ల వద్ద అంతా సందడి సందడిగా ఉంది. ట్రైలర్​తో పాటు ‘కావాలయ్యా’ సాంగ్​తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే మార్నింగ్ షో నుంచే చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో మూవీ సక్సెస్ అయిందని అంటున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి టాక్ రావడంతో ఓపెనింగ్ డే కలెక్షన్లు అదిరిపోయే రేంజ్​లో ఉంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

రొటీన్ ఫార్మాట్​ స్టోరీకి ఆసక్తికరమైన ట్విస్టులను జోడించి ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ సక్సెస్ అయ్యాడని విశ్లేషకులు చెబుతున్నారు.  ‘జైలర్​’లో ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ సీన్​తో పాటు ప్రీ కైమాక్స్ సీన్స్ హైలైట్​గా ఉన్నాయని  అంటున్నారు. రజినీ మాస్ ఎలివేషన్ సీన్స్​కు స్టార్ కంపోజర్ అనిరుధ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్​ మ్యూజిక్ సూపర్బ్ అని టాక్. ‘జైలర్​’ను అనిరుధ్ తన సంగీతంతో నిలబెట్టాడని అంటున్నారు. రజినీ-యోగిబాబులు తమ కామెడీతో ఆడియెన్స్ పొట్టలు చెక్కలయ్యేలా చేశారని వినికిడి. థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తున్న ‘జైలర్’ ఓటీటీ పార్ట్​నర్​ను ఫిక్స్ చేసుకుంది. ఆ విషయాలు ప్రస్తుతం బయటకొచ్చాయి.

తలైవా రజినీకాంత్​తో పాటు కన్నడ స్టార్ హీరో శివరాజ్​ కుమార్, మలయాళ సూపర్​ స్టార్ మోహన్​లాల్ నటించడంతో ‘జైలర్’పై భారీ ఎక్స్​పెక్టేషన్స్ ఉన్నాయి. తమన్నా, రమ్యకృష్ణ లాంటి భారీ తారాగణం ఉన్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం పలు సంస్థలు విపరీతంగా పోటీపడ్డాయట. అయితే ఈ సినిమాను నిర్మించిన సన్​పిక్చర్స్ సంస్థకు చెందిన సొంత ఓటీటీ ప్లాట్​ఫామ్ సన్ నెక్స్ట్ ‘జైలర్’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్​ను సొంతం చేసుకుందని సమాచారం. రిలీజైన నెలన్నర తర్వాత అంటే.. సెప్టెంబర్ చివర్లో ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి