iDreamPost

జగన్ సర్కార్ కీలక నిర్ణయం – భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్టు మరింత ముందుకు

జగన్ సర్కార్ కీలక నిర్ణయం – భోగాపురం విమానాశ్రయ ప్రాజెక్టు మరింత ముందుకు

భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంకి సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో భోగాపురం విమానాశ్రయం పనులు వేగవంతం చేయాలని సి.యం జగన్ గతంలో ఆదేశించిన విషయం తెలిసిందే, ఆమేరకు తాజాగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు అభివృద్ధి , నిర్వాహణ, కార్యకలాపాలపై కాంట్రాక్టు నిర్ధారణ పత్రాన్ని (లెటర్ ఆఫ్ అవార్డ్) ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్‌–1గా నిలిచిన జి.ఎం.ఆర్ ఎయిర్ పోర్టు సంస్థకు అందజేశారు.

గత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా భోగాపురం ఫైలును నడిపించి తొలుత 2,703 ఎకరాల్లో విమానాశ్రయం నిర్మాణం చేపడతారని చెప్పి ఈ భూమిని 99 సంవత్సరాలకు ఎకరానికి రూపాయి లీజుకు అప్పగించిన విషయం తెలిసిందే . అయితే ఎన్నికల అనంతరం వచ్చిన జగన్ ప్రభుత్వం భోగాపురం విమానాశ్రయం నిర్మాణం జి ఎం ఆర్ కు ఇస్తామని, అయితే చంద్రబాబు పాలనలో చెప్పిన విధంగా కాకుండా ఎయిర్ పోర్టుకు 2200 ఎకరాలు మాత్రమే ఇస్తామని మిగిలిన 500 ఎకరాలను ప్రభుత్వం వద్ద ఉంచుకుంటుందని చెప్పారు. అలాగే నిర్మాణ భాద్యతలు పిపిపి విధానంలో జి.యం.ఆర్ కు ఇవ్వబోతునట్టు చెప్పుకోచ్చారు.

లెటర్ ఆఫ్ అవార్డ్ పత్రాన్ని అందుకున్న జి.ఎం.ఆర్ ఎయిర్ పోర్ట్స్ బిజినెస్ చైర్మన్ జీబిఏస్ రాజు మాట్లాడుతు ప్రాజెక్టు అభివృద్ధి నిర్వహణకై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో చేతులు కలపడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ తొలి దశలో సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు సాగించే విధంగా దీనిని నిర్మిస్తామని , కంపెనీ ఈ ఎయిర్ పోర్టును 40ఏళ్ళ పాటు నిర్వహిస్తుందని, నిర్వహణ కాంట్రాక్టు అంతర్జాతీయ పోటి బిడ్డీంగ్ ద్వారా మరో ఇరవై ఏళ్ళు పొడిగించే అవకాశం ఉందని తెలిపారు.

పరిపాలన రాజధానిగా మారనున్న విశాఖ పట్నంకు 45 కిలోమీటర్ల దూరంలో, విజయనగరంకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోగాపురం విమానాశ్రయం సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయంతో రాబోయే రోజుల్లో అంతర్జాతీయ కళను సంతరించుకోనుంది. అలాగే బోగాపురం విమానాశ్రయ ప్రాజెక్టుకు సమీపంలో బీచ్ కారిడార్ అభివృద్ది పనులు వేగంగా సాగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో రీటైల్ , ఆతిధ్య రంగం అభివృద్దికి ఈ ప్రాజెక్టు దోహదం చేయనుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావంతో ఉన్నట్టు తెలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి