iDreamPost

ఆశలు రేపుతున్న జగన్-నీటి ప్రాజెక్టులు

ఆశలు రేపుతున్న జగన్-నీటి ప్రాజెక్టులు

నీళ్ళంటే పారటానికి కాలువ ఉండాలి, నిలువచేయటానికి రిజర్వాయరు ఉండాలి. ఈ రెండు లేకుండా నీళ్లు ఇచ్చామన్నా లేక ఇస్తామన్నా అది మోసం అని ప్రజలకు ,రైతులకు అనుభవంలోకి రావటానికి ఇట్టే సమయం పట్టదు. ఫోటోషాప్ పనితనం,wahtsapp ప్రచారం నీళ్లు పారించలేవు.

రాయలసీమ ప్రధాన సమస్య నీటిని నిలువ చేసుకునే రిజర్వాయర్లు లేకపోవటమే. మొత్తం నాలుగు జిల్లాలలో కలిపి కూడా నికరంగా 100 టీఎంసీ లు నిలువ చేసుకునే సదుపాయం లేదు. జగన్ ఈ సమస్య మీద దృష్టిపెట్టి పథకాలను రూపొందిస్తున్నారు. గండికోట దిగువున ముద్దనూరుకు పశ్చిమాన కొండల మధ్య కొత్త రిజర్వాయర్కు అవకాశం ఉందని గుర్తించిన ప్రభుత్వం ఆరవేటి పల్లె, మంగపట్నం, దేనేపల్లె ప్రాంతంలో 20 టీఎంసీల సామర్ధ్యంతో కొత్త రిజర్వాయరు నిర్మిస్తామని 24-Dec-2019న జరిగిన సభలో జగన్ ప్రకటించాడు.

ఈ కొత్త ప్రాజెక్టు గురించి తెలుసుకోవటానికి గండికోట,పైడిపాలెం ప్రాజెక్టుల గురించి కొంత అవగాహన అవసరం.

1981లో అప్పటి నంద్యాల లోక్ సభ సభ్యుడు పెండేకంటి వెంకట సుబ్బయ్య కృషితో SRBC(శ్రీశైలం కుడి కాలువ) పనుల్లో భాగంగా అంజయ్య శంకుస్థాపన చేసిన పోతిరెడ్డిపాడు రాయలసీమకు జీవనాడి అయ్యింది. ఎన్టీఆర్ తెలుగు గంగ ప్రాజెక్ట్ మొదలు పెట్టిన తరువాత పోతిరెడ్డిపాడు,బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ లను తెలుగు గంగ ప్రాజెక్టులో విలీనం చేశాడు .

పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ ఉన్న కాలువను శ్రీశైలం కుడి ప్రధాన కాలువ (SRMC)గా వ్యహరిస్తారు. బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద కుడి వైపు ఉన్న వెంట్ నుంచి SRBC కాలువ మొదలవుతుంది. గాలేరు-నగరి సుజల స్రవంతి (GNSS)పథకానికి 1988 నవంబర్లో ఎన్టీఆర్ శంకుస్థాపన చెయ్యగా 1990లో చెన్నారెడ్డి పాలనా అనుమతులు ఇచ్చారు. తిరిగి చూస్తే 2004 లో వైస్సార్ జలయజ్ఞం మొదలుపెట్టే వరకు శంకుస్థాపన రాయి తప్ప మరో పని జరగలేదు.

GNSS ప్రాజెక్ట్/పథకంలో భాగంగా
1.బనకచెర్ల దగ్గర కొత్త తూము(Vent) కట్టి నీటిని అప్పటికే పూర్తి అయిన శ్రీశైలం కుడికాలువ(SRBC)లోకి వదిలాలి.
2.గోరకల్లు దగ్గర 12.44 TMCల నిలువ సామర్ధ్యంతో రిజర్వాయర్ కట్టాలి.
3.గోరకల్లు నుంచి అవుకు రిజర్వాయర్ వరకు వరద కాలువ తొవ్వాలి.
4.చిత్రావతి నది పెన్నాలో కలిసే “గండికోట” దగ్గర 16.84 TMC లతో రిజర్వాయర్ కట్టటం.
5.అవుకు నుంచి కాలువ & టన్నెల్ల ద్వారా మొత్తం 58 కి.మీ కాలువ తొవ్వి గండికోటకు నీళ్ళు చేర్చాలి.
6.గండికోట నుంచి వామికొండ సాగర్(1.6 TMC), సర్వారాయ సాగర్(3.059 ),ఉద్దిమడుగు(1.04 TMC),మల్లిమడుగు(2.86 TMC),శ్రీబాలాజి(3 TMC),పద్మసాగర్(0.45 TMC), శ్రీనివాస సాగర్(0.448 TMC),వేణుగోపాల సాగర్,వేపగుంట,అడవి కొత్తూరు (1 TMC) రిజర్వాయరలు నిర్మించి నగరి వద్దగల “నగరి” నది వరకు 38 TMCల మిగులు జలాలను తీసుకెళ్ళాలి.

ఆ రోజు వైస్సార్ వేసిన పునాదుల మీదనే కిరణ్ కుమార్ రెడ్డి అయినా చంద్రబాబు అయినా నీళ్లను పారించింది. కిరణ్ కుమార్ రెడ్డి తన హాయంలో హంద్రీ-నీవా పథకం ద్వారా అనంతపురం జిల్లాకు చరిత్రలో తొలి సారి కృష్ణా నీటిని తీసుకెళ్లాడు.అదే ఊపులో 2013 సెప్టెంబర్లో SRBC కాలువ ద్వారా గండికోటకు 2 TMCల నీటిని పారించాడు.  

GNSS ప్రధాన లక్ష్యం కడప ,చిత్తూర్ జిల్లాకు సాగు నీరు మరియు తాగు నీరు అందించటం. GNSS కాలువ ద్వారా అనుకున్న మేర లక్ష్యం చేరుకోలేమని భావించిన వైస్సార్ 2006లో గండికోట సామర్ధ్యాన్ని 16 టిఎంసి ల నుంచి 26. టీఎంసీ లకు పెంచి రెండు ఎత్తిపోతల పథకాలకు అనుమతి ఇచ్చాడు.

1.గండికోట ఎత్తిపోతల-1
మొదటగా గండికోట నుంచి “పైడిపాలెం”కు అక్కడి నుంచి హిమకుంట్ల చెరువుకు నీటిని పారించాలి.హిమకుంట్ల చెరువు బ్యాక్ వాటర్లో కొండాపురం దగ్గర పంప్ హౌస్ కట్టి చిత్రావతి కాలువలలో నీటిని చేర్చాలి.

విధంగా GNSS ఒరిజినల్ డిజైన్ లో లేని పైడిపాలెం ప్రాజెక్టు తెరమీదికి వచ్చింది. పైడిపాలెం వద్ద 6 టీఎంసీ ల సామర్ధ్యం గల రిజర్వాయర్ కు 23-May- 2005న వైస్సార్ శంకుస్థాపన చేశాడు. 2014 మే చివరికే పైడిపాలెం పూర్తయ్యింది. చంద్రబాబు మొదటి రెండు సంవత్సరాలు పైడిపాలెం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశాడు . పులివెందులకు కృష్ణా నీళ్లు ఇచ్చేవరకు గడ్డం తీయమని సతీష్ రెడ్డి శపథంతో చంద్రబాబు కదిలి మూడుసార్లు గడువు పెంచి చివరికి 2017 జనవరిలో గండికోట నుంచి పైడిపాలెం ప్రాజెక్టుకు నీళ్లు విడుదల చేసి ట్రయిల్ రన్ నిర్వహించారు.

2.గండికోట నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి 8.30 TMCలను ఎత్తిపోతల.

ఈ పథకంలో బాగంగా 6 చిన్న ఎత్తిపోతలు నిర్మించారు.ఈ ఎత్తిపోతల పనులు కూడ  2014 నాటికే పూర్తి అయ్యాయి.

గండికోట లో 4 నుంచి 6 టీఎంసీ ల నీరు ఉంటేనే ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు ఆపరేట్ చెయ్యటానికి కావలసిన లేవల్ ఉంటుంది.గోరకల్లు నుంచి గండికోటకు నీళ్లు తీసుకెళ్లవలసిన కాలువ పనులు,టన్నెల్ పనులు పూరి కాకవపోవటంతో ఈ రెండు ఎత్తిపోతల పథకాలు 2012/2013 నాటికి పూర్తిఅయినా 2018 వరకు ఆపరేషన్ లోకి రాలేదు.

వైస్సార్ తరువాత కొత్త ప్రాజెక్టులు కానీ కాలువల సామర్ధ్యం పెంచటం కానీ జరగకపోవటంతో మంచి వరద వచ్చిన సంవత్సరాలలో కూడా రాయలసీమకు నీరు అందటం లేదు. ఈ విషయం మీద దృష్టి పెట్టిన జగన్ ఈ ఈ నెలలో కుందు నుంచి బ్రహ్మం సాగర్ కు ఒక ఎత్తిపోతల, కుందు మీద రాజోలి వద్ద 3 టీఎంసీల రిజర్వాయర్, జోలదరాశి వద్ద 0.8 టీఎంసీ లతో మరో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాడు.
ఈ పథకాలు కర్నూల్ జిల్లాలోని బనగానిపల్లె ,కొంత మేర ఆళ్లగడ్డ నియోజకవర్గాలకు,కడప జిల్లా బద్వేల్,మైదుకూరు,ప్రొద్దుటూరు నియోజకవర్గాలకు ఉపయోగపడతాయి.

Also Read : నీటి కలల సాకారం దిశగా- మూడు శంకుస్థాపనలు

రాయలసీమ ప్రధాన సమస్య నీటిని నిలువ చేసుకునే రిజర్వాయర్లు లేకపోవటమే.మొత్తం నాలుగు జిల్లాలలో కలిపి కూడా 100 టీఎంసీ లు నిలువ చేసుకునే సదుపాయం లేదు.జగన్ ఈ సమస్య మీద దృష్టి పెట్టి పథకాలను రూపొందిస్తున్నారు. గండికోట దిగువున ముద్దనూరు కు పశ్చిమాన సహజమైన కొండల మధ్య కొత్త రిజర్వాయర్కు అవకాశం ఉందని గుర్తించిన ప్రభుత్వం ఆరవేటి పల్లె,మంగపట్నం ,దేనే పల్లె ప్రాంతంలో 20 టీఎంసీ ల సామర్ధ్యంతో కొత్త రిజర్వాయరు నిర్మిస్తామని 24-Dec-2019న జరిగిన సభలో జగన్ ప్రకటించాడు.

20 టీఎంసీల ప్రాజెక్టా ? అక్కడ అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టటం సాధ్యమా? అవకాశాలు సృష్టించటం అంటే ఇదే! జగన్ ఆ ప్రాజెక్టును ప్రకటించే వరకు అక్కడ అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టటానికి అవకాశం ఉందన్న సంగతి కూడా తెలియదు. గతంలో ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరు ప్రతిపాదించలేదు.

మూడు వైపులా సహజ సిద్దమైన కొండలు,ఒక వైఫు రెండు నుంచి మూడు కి.మీ కట్ట (బండ్) కడితే 20 టీఎంసీల స్టోరేజ్…ఈ కల సాకారం కావాలి. అది కూడా మూడు సంవత్సరాలలోనే ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కావాలి .ఇప్పటికి ఉన్న అంచనా ప్రకారం ఆరవేటి పల్లె , దేనే పల్లె ,మంగపట్నం గ్రామాలు ముంపుకు గురవుతాయి. సుగుమంచి పల్లె, చింతకుంట చెరువులు రిజర్వాయర్లో కలిసిపోతాయి. సుమారు 1500 నుంచి 2000 ఎకరాలు ముంపుకు గురికావచ్చు. ఇందులో 30% అసైన్డ్ భూములు ఉండొచ్చని అంచానా.

ఈ ప్రాజెక్టుకు ఉన్న మరో సానుకూలత గండికోట నుంచి గ్రావిటీ కాలువ ద్వారా ప్రతిపాదిత రిజర్వాయర్లోకి నీటిని తీసుకెళ్లవచ్చు.ఇప్పటికే పూర్తి అయిన GNSS కాలువ ప్రతిపాదిత నిర్మాణ ప్రాంతానికి మూడు కి.మీ దూరంలోనే ఉంది. కొత్త కాలువ అవసరం లేకుండానే GNSS కు ఒక లింకు కాలువను తొవ్వి నీరు పారించవచ్చు.

ఆ గ్రామస్తులు కూడా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఆహ్వానిస్తున్నారు. తమకు మరొక చోట భూములు ఇవ్వమని న్యాయమైన కోరిక కోరుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు నిర్వాసితుల పునరావాసం మీద కూడా అదే శ్రద్ద స్థాయి పెట్టాలి. ప్రాజెక్ట్ పూర్తి కాకముందే R & R ప్యాకేజి ఇవ్వాలి.

జగన్ అనుకున్నట్లు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అయితే గండికోట కింద కడప ,చిత్తూర్ జిల్లాలలోని GNSS కాలువ పరివాహక ప్రాంతంలో సాగు,తాగు నీరుకు భరోసా దక్కుతుంది.

ఈ ప్రాజెక్టును అందరు ఆహ్వానిస్తారు కానీ గాలేరు-నగరి పథకంలోని చిత్తూర్ జిల్లా పరిధిలోని రెండవ దశ పనులు కూడా వేగవంతంగా జరగాలని ఆ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు. చివరి ఆయకట్టుకు సాగు నీరు ,గ్రామాలకు తాగు నీరు అందినప్పుడే ఆ ప్రాజెక్టుకు సార్ధకత. జగన్ దీని మీద కూడా దృష్టిపెట్టాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి