iDreamPost

CM జగన్ మంచి మనస్సు.. దివ్యాంగునికి సత్వర సాయం..

CM జగన్ మంచి మనస్సు.. దివ్యాంగునికి సత్వర సాయం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక రకాల సంక్షేమ పథకాలతో సుపరిపాలన అందిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక చేయుత నిచ్చేలా సంస్కరణలు చేపట్టారు. ఇక అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా అనేక చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని రకాల పథకాలు ప్రజలకు అందిస్తున్నారు. ఇక పెన్షన్ వంటి వాటిలో తలెత్తే సమస్యలను సత్వరం పరిష్కరం చూపించేలా చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఎందరో అర్హత ఉండి కూడా పెన్షన్ పొందలేక పోయారు. అలాంటి వారికి వైసీపీ ప్రభుత్వంలో వెంటనే అందుతున్నాయి. తాజాగా చంద్రబాబు హయాంలో దివ్వాగునికి రానీ పెన్షన్.. జగన్ ప్రభుత్వం అందించింది.

కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక పంచాయతీ గణపతి నగర్ కు చెందిన వీరిశెట్టి ఫణిబాబు, లక్ష్మీ ప్రసన్నలకు లక్ష్మణ్ అనే 15 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.  లక్ష్మణ్ దివ్వాంగుడు కావడంతో పెన్షన్ కోసం  ఆ కుటుంబం ప్రయత్నించింది.  దివ్వాంగుడైన లక్ష్మణ్ కు వేలి ముద్రలు పడటం లేదనే సాకుతో మంజూరైన పెన్షన్  కూడా గత ప్రభుత్వ హయాంలో రద్దు చేశారు. తిరిగి 2020లో పెన్షన్ కోసం దరఖాస్తు చేయగా జగనన్న ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక అప్పటి నుంచి క్రమం తప్పకుండా నెలనెల లక్ష్మణ్ కుటుంబానికి పెన్షన్ వస్తుంది.

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తమ బిడ్డకు వికలాంగుల పింఛను  అందిస్తున్నారని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక సచివాలయం పరిధిలోని వాలంటీర్ ప్రతాప్ లబ్ధిదారు లక్ష్మణ్ కు పింఛను నగదు అందిస్తున్న సందర్భం ఇది. వేలి ముద్రలు పడటం లేదనే సాకుతో గత ప్రభుత్వం హయంలో నిలిపివేసిన ఫించను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందించింది. ఇలా కేవలం లక్ష్మణ్ ఒక్కడికే కాకుండ అలాంటి చాలా కుటుంబాలకు జగన్ సర్కార్ ఆదుకుంటుంది. మరి.. కులం, మతం, పార్టీలు చూడకుండా అందరిని ఆదకుంటున్న జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి