iDreamPost

భూవివాదాల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా భూముల రీసర్వే ప్రారంభించిన జగన్ సర్కార్

భూవివాదాల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా భూముల రీసర్వే ప్రారంభించిన జగన్ సర్కార్

రాష్ట్రంలో బ్రిటీష్ ప్రభుత్వం హయాంలో షుమారు 120ఏళ్ళ క్రితం భూములను సర్వే చేసి ఆర్.యస్.ఆర్ రూపొందించారు. తరువాత కాలంలో జనాభా పెరగడం , భూములు పలు సార్లు చేతులు మారడం భూ కమతాల సైజులు తగ్గడంతో సబ్ డివిజన్లు సర్వే నెంబర్లు పెరిగి అనేక చోట్ల భూ వివాదాలు చెలరేగి కోర్టుల్లో సివిల్ కేసులు, మరి కొన్ని చోట్ల భూ వివాదాలు , హత్యలతో శాంతి భద్రతల సమస్యగా తయ్యరయ్యాయి . ఈ సమస్యలన్ని పరిష్కరించాలి అంటే భూములు రీసర్వే చెయటమే ఏకైక మార్గం అని నిపుణులు ఏళ్ల తరబడి చెబుతున్నా గత పాలకులు పట్టించుకోలేదు. 2014 ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్రలో వై.యఎస్ జగన్ తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ తాను ఎన్నికల ముందు హామీ ఇచినట్టుగానే భూముల సమగ్ర రీసర్వేకు శ్రీకారం చుట్టారు దీనికోసం బడ్జెట్ లో నిధులు కేటాయించటంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయాల ద్వారా 11,158 మంది గ్రామ సర్వేయర్లను నియమించారు. భూ యజమానులకు కచ్చితత్వాన్ని అందించే విధంగా అమెరికా, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల్లో వినియోగించే అత్యాదునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత దేశంలోనే తొలి సారి రాష్ట్రంలో ఉపయోగించటానికి సిద్ధమయ్యారు . 2022 మార్చ్ నాటికి రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి చేసి పటిష్టమైన నూతన రెవిన్యూ రికార్డులు రూపొందిచాలనే లక్ష్యంతో ఉన్నామని ఇప్పటికే ప్రకటించారు.

అయితే తాజాగా ఈ రీసర్వే విధానాన్ని 2020 ఫిబ్రవరి 18నుండి పైలెట్ ప్రాజక్ట్ గా మొదలు పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు రీసర్వేని రాష్ట్రంలో మొట్టమొదటగా కృష్ణా జిల్లా జగయ్యపేట మండలం తక్కెళ్ల పాడు గ్రామం నుండి ప్రారంభిస్తునట్టు ప్రభుత్వ విప్ జగ్గయ్య పేట శాసన సభ్యులు సామినేని ఉదయ భాను ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సియం, రెవిన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చేతుల మీదగా భూముల రీసర్వే పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించబోతునట్టు చెప్పుకొచ్చారు. జగ్గయ్యపేట మండలంలోని 25 గ్రామాల పరిధిలో గల 66,761 ఎకరాల భూములకు రీసర్వే రాబోయే మూడు మాసాల్లో పూర్తి చేస్తామని ఈ అనుభవాలతో తరువాత రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే చెస్తామని చెప్పుకోచ్చారు.

అయితే ఈ రీసర్వే ద్వారా నిర్ధారించిన భూముల యొక్క వివరాలు అన్ని జగ్గయ్యపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్ స్టేషన్ లో సమాచారం అంతా నిక్షిప్తమవుతుందని ఈ ప్రక్రియ ద్వారా భూ సమస్యలకు చెక్ పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కావున రైతులందరూ డిప్యూటీ సియం, రెవిన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చేతుల మీదగా భూముల రీసర్వే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని అయన కోరారు.

నిజానికి ప్రతి 30 ఏళ్లకోసారి భూములు రీసర్వే చేయాల్సి ఉండగా, గత ప్రభుత్వాలు రాష్ట్రంలో భూ సమస్యలు పెరిగిపోతున్నా పట్టించుకోలేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన జగన్ సర్కార్ భూముల రీసర్వే ప్రక్రియతో ఈ సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టే ఆలోచన చేస్తుంది. ప్రభుత్వం ఆలోచిస్తునట్టు ఈ ప్రక్రియ విజయవంతం అయితే రాష్ట్రంలో అనేక సమస్యలకు మూల కేంద్రంగా ఉండే భూవివాదాలకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభించినట్టే అని చెప్పవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి