iDreamPost

Pooja Hegde – Vijay Devarakonda రౌడీ బాయ్ జోడిగా బుట్టబొమ్మ

Pooja Hegde – Vijay Devarakonda రౌడీ బాయ్ జోడిగా బుట్టబొమ్మ

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించబోతోందనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు కానీ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందబోయే జనగణమనలో తనే హీరోయిన్ గా లాక్ అయ్యిందని వినికిడి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఢిల్లీ కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో శివ నిర్వాణ డైరెక్షన్ లో తీస్తున్న సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. ఇదయ్యాక జనగణమణ సెట్స్ పైకి వెళ్తుంది. ఆగస్ట్ 25 లైగర్ రిలీజ్ ప్లస్ ప్రమోషన్ల కోసం ఆ నెల మొత్తం బ్రేక్ తీసుకోబోతున్న విజయ్ తర్వాత బాలన్స్ ఉన్న శివ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాడు. ఇందులో సమంతా జోడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో చాలా పవర్ ఫుల్ సబ్జెక్టుతో పూరి జనగణమన తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండని సోల్జర్ గా చూపించబోతున్నారు. బ్యాక్ డ్రాప్, టైం పీరియడ్ లాంటి వివరాలేమీ చెప్పలేదు కానీ లైగర్ థియేటర్ లోకి వచ్చాకే మిగిలిన వాటి గురించి మాట్లాడబోతున్నారు. పూజా హెగ్డే ఇప్పటిదాకా తనతో కలిసి నటించలేదు. ఆల్రెడీ టాలీవుడ్ టాప్ లీగ్ హీరోస్ అందరూ అయ్యారు. కోలీవుడ్ లో విజయ్ తో రీసెంట్ గా బీస్ట్ చేసింది కానీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆచార్యలో రామ్ చరణ్ పక్కన హోమ్లీగా కనిపిస్తే వీక్ కంటెంట్ వల్ల అది కాస్తా డిజాస్టర్ అయ్యింది. ఇక రాధే శ్యామ్ మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు.

సో విజయ్ దేవరకొండ పూజా హెగ్డే అంటే మంచి క్రేజీ కాంబినేషన్ అవుతుంది. పూరి చెబితే కానీ క్లారిటీ రాదు. ఇది పక్కనపెడితే పూజా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాబోయే భవదీయుడు భగత్ సింగ్ లో నటించబోతోంది. ఇదీ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. సల్మాన్ ఖాన్ కభీ ఈద్ కభీ దివాలి రెగ్యులర్ షూట్ స్టార్ట్ అయ్యింది. ఇందులో పూజా పాత్ర తీరుతెన్నులు తెలియాల్సి ఉంది. మొత్తానికి పూరి జగన్నాథ్ తన జనగణమన కోసం క్రేజీ క్యాస్టింగ్ ని సెట్ చేసే పనిలో ఉన్నారు. ఒకవేళ అంచనాలకు తగ్గట్టు లైగర్ కనక బ్లాక్ బస్టర్ అయితే దాని ఫలితం నెక్స్ట్ చేయబోయే జనగణమన మీద పాజిటివ్ గా ఉంటుంది. చూద్దాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి