iDreamPost

ఇప్పుడు సోనియా కోటరీ వంతు- ఐటి నోటీసులు

ఇప్పుడు సోనియా కోటరీ వంతు- ఐటి నోటీసులు

ఆంధ్రప్రదేశ్ లో మొదలైన ఐటి దాడులు అలా తవ్వుకుంటూ వెళితే ఎక్కడెక్కడికో దారి తీస్తున్నాయి. ఫిబ్రవరి 6న ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, ఢిల్లీ,మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఐటి దాడులు మొదలయ్యాయి. దాదాపు 40కి పైగా ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి.

చంద్రబాబు నాయుడి దగ్గర 20 ఏళ్లపాటు పీయేగా పని చేసిన పెండ్యాల శ్రీనివాసరావు ఇంట్లో జరిపిన సోదాల్లో దాదాపు రూ.2000 కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన లింకులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే కావచ్చు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు,సోనియా గాంధీ ఒకనాటి రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ను తమ ముందు హాజరవ్వాలని ఐటి శాఖ లోని 131 నిబంధన కింద నోటిసులు ఇచ్చింది.రూ.400 కోట్ల డబ్బును హవాలా ద్వారా మళ్లించడం వెనుక ఈయన పాత్ర ఉందని అనుమానించిన ఐటి శాఖ ఈనెల 14న తమ ముందు హాజరై సమాధానం ఇవ్వాలని నోటీసులు ఇవ్వగా ఆయన వాటిని బేఖాతరు చేశారు.ఇప్పుడు తాజాగా ఈనెల 18న రావాల్సిందిగా మళ్ళీ నోటీసులు ఇచ్చినా ఆయన వెళ్లలేదు. శ్వాస సంబంధ అనారోగ్యం తో ఆస్పత్రిలో ఉన్నానని చెప్పి తప్పించుకున్నారు.

అది తెలుగు ప్రజల డబ్బేనా?

ఇదిలా ఉండగా బిజెపితోను, మోడీతోను గత ఎన్నికలకు ముందు కయ్యం పెట్టుకుని ఎన్డీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుని తెలంగాణలో ఎన్నికలకు వెళ్లారు.ఆమోజులోనే కర్ణాటక,మధ్యప్రదేశ్ , రాజస్థాన్ తదితర అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ కు ఏపీ నుంచి డబ్బు పంపిణీ చేసినట్లు ప్రస్తుత కేంద్ర సర్కార్ అనుమానిస్తోంది. అనుమానాలు నిజమానేలా ఐటి దాడుల్లో ఆధారాలు కూడా లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అహ్మద్ పటేల్ శ్వీకరించిన 400 కోట్లు కూడా ఇలా ఏపీ నుంచి హవాలా మార్గంలో వెళ్లినవే అని ఐటి శాఖ డవుట్.

గత సాధారణ ఎన్నికలకు ముందు చంద్రబాబు పలుమార్లు అహ్మద్ పటేల్ తో భేటి అయ్యారు. యుపిఎ అధికారంలో ఉన్న పదేళ్ళపాటు అహ్మద్ పటేల్ అంతులేని అధికారం అనుభవిించారు. సోనియా తరువాత కాంగ్రెస్ లో ఆయనే పవర్ ఫుల్ గా ఉండేవారు. కాంగ్రెస్ కోశాధికారిగా కూడా వ్యవహరించిన పటేల్ పార్టీ ఆర్థిక వ్యవహారాలు కూడా చక్కబెట్టేవారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి