iDreamPost

ISROలో ఉద్యోగం తెచ్చుకోవడం ఎలా? ప్రస్తుతం ఉన్న అవకాశాలు ఏంటి?

  • Author Soma Sekhar Updated - 01:20 PM, Thu - 24 August 23
  • Author Soma Sekhar Updated - 01:20 PM, Thu - 24 August 23
ISROలో ఉద్యోగం తెచ్చుకోవడం ఎలా? ప్రస్తుతం ఉన్న అవకాశాలు ఏంటి?

చంద్రయాన్-3 సూపర్ సక్సెస్ కావడంతో.. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆఖరికి శత్రుదేశం అయిన పాకిస్థాన్ సైతం ఇండియాపై ప్రశంసలు కురిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇస్రోలో జాబ్ సాధించడం ఎలా? అని సోషల్ మీడియాలో చాలా మంది చర్చించుకుంటున్నారు, అందుకు సంబంధించిన సమాచారాన్ని వెతుకుతున్నారు. అదీకాక ప్రస్తుతం ఫార్మసిస్ట్-ఏ, రేడియోగ్రాఫర్-ఏ, లాబ్ టెక్నీషియన్-ఏ, కుక్, లైట్ వెహికల్ డ్రైవర్ ఏ, హెవీ వెహికల్ డ్రైవర్ ఏ, ఫైర్ మెన్ ఏ లాంటి ఉద్యోగాలకు రిక్రూమెంట్ జరుగుతోంది. మరి ప్రస్తుతం ఇస్రోలో అందుబాటులో ఉన్న కెరీర్ అవకాశాలు, ఉద్యోగాలు, అందుకు కావాల్సిన అర్హతలు, ఎంపిక ప్రక్రియ లాంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

స్కూల్ లో చిన్నతనంలో టీచర్ నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? అని అడిగితే.. చాలా మంది సైంటిస్ట్ అని చెప్పడం మనకు తెలియని విషయం కాదు. ఇక చిన్నతనం నుంచే ఖగోళ శాస్త్రంపై ఆసక్తి చూపే వాళ్లు చాలా మందే ఉంటారు. అలాంటి వారికి ఉన్నతమైన లక్ష్యం అంటూ ఏదైనా ఉంటే అది ఇస్రోలో సైంటిస్ట్ గా ఉద్యోగం సాధించడమే. మరి ఇలాంటి ఉన్నతమైన సంస్థలో ఉద్యోగం సాధించడం సామాన్యమైన విషయమేమీ కాదు. అందుకు ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఇక ఇస్రో లాంటి సంస్థలో నైపుణ్యం, అనుభవం కలిగిన సైంటిస్టులు ఎంతో మంది ఉంటారు. కాగా.. ఇస్రో తన అధికారిక వెబ్ సైట్ లో ఎప్పటికప్పుడు శాస్ర్తవేత్తల రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ను విడుదల చేస్తూ ఉంటుంది.

ఇస్రోలో ఉన్న జాబ్స్

ప్రస్తుతం ఇస్రోలో పలు రకాల జాబ్స్ కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ జాబ్స్ కు రేపే(ఆగస్టు 24) చివరి తేదీ. మరి ఖాళీలు ఉన్న కేటగిరీలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్రో క్యాటరింగ్ సూపర్ వైజర్, నర్సు-బీ, ల్యాబ్ టెక్నీషియన్-ఏ, ఫార్మసిస్ట్-ఏ, రేడియోగ్రాఫర్-ఏ, కుక్, లైట్ వెహికల్ డ్రైవర్ ఏ, ఫైర్ మెన్ ఏ లకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ జాబ్స్ కు జీతం పే మ్యాట్రిక్స్ లోని లెవెల్ 10 ప్రకారం ఉంటుంది.

ISROలో ఇతర ఉద్యోగాలు

ఇస్రోలో శాస్త్రవేత్తలు కాకుండా ఇతర ఉద్యోగాలు కూడా చాలానే ఉన్నాయి. ఇస్రో టెక్నీషియన్ బీ, డ్రాఫ్ట్ మన్ బీ, టెక్నికల్ అసిస్టెంట్/లైబ్రరీ అసిస్టెంట్-ఏ/సైంటిఫిక్ అసిస్టెంట్, నర్సు, సపోర్ట్ స్టాఫ్ లతో పాటు ఇతర ఆఫీస్ సిబ్బంది నియామకాలను చేపడుతుంది. పదవ తరగతి నుంచి పీజీ వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇస్రోలో జాబ్ సాధించాలని కలలు కనే వారు రిక్రూమెంట్ నోటిఫికేషన్ కోసం, ఇతర వివరాల కోసం ఎప్పటికప్పుడు అధికారిక వెబ్ సైట్ ను చెక్ చేస్తూ ఉండాలి. ఈ ఉద్యోగాలకు కనీసం 65 శాతం మార్కులతో ఇంజనీరింగ్ లేదా సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా CGPA 6.84/10 కలిగి ఉండాలి. కాగా.. దరఖాస్తు చివరి తేదీ నాటికి వయసు 28 ఏళ్లకు మించకూడదు. ఈ ఉద్యోగాలకు రాత పరీక్షతో పాటుగా ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బీ పేపర్లు ఒకే ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ ఉంటుంది. మరి ఇస్రోలో ఉద్యోగం పొందడమే మీ కల అయితే మీ కలను సాకారం చేసుకోండి.

ఇదికూడా చదవండి: చరిత్ర లిఖించిన ‘చంద్రయాన్ 3’.. ఈ సక్సెస్ సినిమాగా రాబోతుందా?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి