iDreamPost

దేశం కోసం కదనరంగంలోకి జర్నలిస్టు.. భార్యకు వీడ్కోలు!

దేశం కోసం కదనరంగంలోకి జర్నలిస్టు.. భార్యకు వీడ్కోలు!

ప్రపంచం మొత్తం ఇప్పుడు హమాస్-ఇజ్రాయెల్ కి మధ్య జరుగుతున్న యుద్దం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇజ్రాయెల్ పై హమాస్ మెరుపు దాడి చేయడంతో ఉక్కిరి బిక్కిరి అయ్యింది. ఇజ్రాయెల్ పై కొనసాగుతున్న హమాస్ ఉగ్రవాదుల దాడి కారణంగా ఎంతోమంది అమాయకులు చనిపోయారు.. వందల మంది అనాథలుగా మిగిలిలారు. ఇరవై నిమిషాల్లో వేలాది రాకెట్లతో దాడి చేయడంతో ఏం జరుగుతుందో అయోమయానికి గురైన ఇజ్రాయెల్ వెంటనే ఎదురుదాడికి దిగింది. తమ భూభాగంపై తీవ్ర నష్టం కలిగించిన హమాస్ దాడిని ఇజ్రాయెల్ తిప్పికొడుతుంది. హమాస్ దాడి నుంచి తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఇజ్రాయెల్ యువత స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రమూకలు హఠాత్తుగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వందల సంఖ్యల్లో ప్రాణాలు కోల్పోయారు. యుద్దాన్ని తాము ఏమీ కోరలేదని.. అయినా అన్యాయంగా యుద్దానికి దిగిన హమాస్ ప్రారంభించిన యుద్దాన్ని సమర్ధవంతంగా మేం ముగిస్తాం అని ఇజ్రాయేల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు అన్నారు. ఈసారి తాము కొట్టే దెబ్బకు శత్రువులు దశాబ్దాల పాటు గుర్తుంచుకుంటారని ప్రకటించారు. తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఇజ్రాయేల్ యువత స్వచ్చందంగా ముందుకు వస్తున్నారని.. ఈ క్రమంలోనే మూడు లక్షల మంది సిద్దంగా ఉన్నట్టు తెలిపారు. కదనరంగంలోకి దూకబోతున్నవారిలో ప్రముఖ జర్నలిస్టు హనన్యా నఫ్తాలీ ఉన్నారు.

యుద్దానికి వెళ్లే ముందు ఆయన తన భార్యను హత్తుకొని ఉన్న ఫోటోను సోషల్ మాధ్యంలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ‘నా దేశాన్ని రక్షించుకునేందుకు నేను వెళ్తున్నా.. నా భార్య ఇండియా నఫ్తాలికి గుడ్ బై చెప్పేశాను. ఆమె నన్ను వీరోచితంగా పోరాడాలని కోరింది.. నన్ను ఆశీర్వదించాలని భగవంతుడిని ప్రార్ధించింది. మా ఇళ్లను, కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది. ఇప్పటి నుంచి నా తరుపు సోషల్ మీడియా ఖాతాను ఆమె నిర్వహిస్తుంది’ అని రాసుకొచ్చారు నఫ్తాలి. ఇండియా నఫ్తాలీ కూడా ఓ జర్నలిస్టు. అక్కడ జరుగుతున్న దాడుల గురించి ఆమె ప్రతి అప్ డేట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి