iDreamPost

ఇషాన్​కు ఇంత అహం ఎందుకు? బీసీసీఐ రమ్మన్నా వినకుండా..!

  • Published Mar 02, 2024 | 3:13 PMUpdated Mar 02, 2024 | 3:13 PM

టీమిండియా యంగ్ వికెట్ కీపర్, బ్యాట్స్​మన్ ఇషాన్ కిషన్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్​ను కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వివాదంలో మరో కొత్త విషయం బయటకు వచ్చింది.

టీమిండియా యంగ్ వికెట్ కీపర్, బ్యాట్స్​మన్ ఇషాన్ కిషన్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్​ను కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వివాదంలో మరో కొత్త విషయం బయటకు వచ్చింది.

  • Published Mar 02, 2024 | 3:13 PMUpdated Mar 02, 2024 | 3:13 PM
ఇషాన్​కు ఇంత అహం ఎందుకు? బీసీసీఐ రమ్మన్నా వినకుండా..!

భారత యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్​ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్​ను కోల్పోయిన సంగతి తెలిసిందే. చాన్నాళ్లుగా టీమిండియాకు ఆడుతుండటం, జట్టులో కీలక ఆటగాళ్లుగా ఎదగడం, ఫ్యూచర్ స్టార్లుగా పేరు తెచ్చుకున్న వాళ్లు ఇలా అర్ధాంతరంగా కాంట్రాక్ట్ కోల్పోవడంపై డిస్కషన్స్​ నడుస్తున్నాయి. ఈ వ్యవహారంలో అసలు తప్పు ఎవరిది? అనేది తీవ్ర చర్చకు దారితీసింది. అయితే సరిగ్గా గమనిస్తే ఇషాన్, అయ్యర్ స్వీయ తప్పిదాల వల్లే బోర్డు వేటుకు గురికావాల్సి వచ్చిందని అర్థమవుతోంది. మరీ ముఖ్యంగా ఇషాన్ వ్యవహార శైలి మీద బీసీసీఐ ఆగ్రహంతోనే ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ వివాదంలో మరో కొత్త విషయం బయటకు వచ్చింది. ఇంగ్లండ్​తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్​కు టీమ్​లోకి రమ్మని అతడ్ని బోర్డు ఆహ్వానించిందట.

ఇంగ్లండ్​తో టెస్టు సిరీస్​కు ఇషాన్ కిషన్​ను పరిగణనలోకి తీసుకునేందుకు భారత క్రికెట్ బోర్డు ప్రయత్నించిందని సమాచారం. అయితే అతడు అందుబాటులో లేకపోవడంతోనే సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వలేదని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. సౌతాఫ్రికా టూర్ మధ్యలోనే పర్సనల్ రీజన్స్​తో స్వదేశానికి తిరిగి వచ్చేసిన ఈ యంగ్ బ్యాటర్.. దుబాయ్​లో పార్టీకి వెళ్లడం, ఆ ఫొటోలు బయటకు రావడంతో సెలక్టర్లు సీరియస్ అయ్యారట. పోనీలే, ఈ ఒక్కసారికి క్షమించి టీమ్​లోకి అవకాశం ఇద్దామంటే అతడు టచ్​లో లేకుండా పోయాడట. ఇంగ్లండ్​తో టెస్టు సిరీస్​కు టీమ్​లోకి తీసుకుందామని భావిస్తే.. దానికీ దూరంగా ఉన్నాడని తెలుస్తోంది. అదే టైమ్​లో ఐపీఎల్ కోసం రిలయన్స్ గ్రౌండ్​లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్​గా మారాయి.

డొమెస్టిక్ క్రికెట్​లో ఆడి ఫామ్, ఫిట్​నెస్ నిరూపించుకుంటే టీమ్​లోకి తీసుకుంటామని సూచించినా ఇషాన్ పెడచెవిన పెట్టాడు. అంతేగాక క్యాష్ రిచ్ లీగ్ కోసం ప్రాక్టీస్ చేసుకోవడంతో బోర్డు పెద్దలకు చిర్రెత్తుకొచ్చిందట. ఆదేశాలను పాటించకపోవడమే గాక ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేయడంతో ఇషాన్​ కాంట్రాక్ట్​ను బీసీసీఐ రద్దు చేసిందని తెలుస్తోంది. అయితే ఇంగ్లండ్​తో చివరి మూడు టెస్టుల కోసం కూడా ఈ యంగ్ వికెట్ కీపర్​ను సెలక్టర్లు సంప్రదించారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. బోర్డు ఎంత టచ్​లోకి వెళ్దామన్నా అతడి నుంచి స్పందన రాలేదని సమాచారం. ఇంకా రెడీగా లేనట్లు ఇషాన్ ఆన్సర్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. దీంతో వేరే ఆప్షన్ లేక కొత్త కుర్రాడు ధృవ్ జురెల్​కు మేనేజ్​మెంట్ అవకాశం ఇచ్చిందట.

అనుకోకుండా వచ్చిన గోల్డెన్​ ఛాన్స్​ను సద్వినియోగం చేసుకున్న జురెల్ తన రెండో టెస్టులోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. బీసీసీఐ టీమ్​లోకి రమ్మన్నా రెడీగా లేనని ఇషాన్ అన్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇషాన్​కు ఇంత అహం ఎందుకని.. బోర్డు పిలిచినప్పుడు వెళ్లి ఆడితే సరిపోయేది కదా అని కామెంట్స్ చేస్తున్నారు. అనవసర భేషజాలకు పోయి కాంట్రాక్ట్​ను కోల్పోయాడని చెబుతున్నారు. మరి.. ఇషాన్​-బీసీసీఐ కాంట్రవర్సీపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వీడియో: స్టీవ్‌ స్మిత్‌ స్టన్నింగ్‌ ఫీల్డింగ్‌! చూస్తే గూస్‌బమ్స్‌ పక్కా..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి