iDreamPost

నానికి లైన్ క్లియర్ చేస్తున్న అల్లు అర్జున్! అచ్చం తారక్ లానే!

  • Published Feb 13, 2024 | 2:13 PMUpdated Feb 13, 2024 | 2:13 PM

Saipodhaa Sanivaaram: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నాని సినిమాకు లైన్‌ క్లియర్‌ చేస్తున్నారు. ఎలా అంటే..

Saipodhaa Sanivaaram: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నాని సినిమాకు లైన్‌ క్లియర్‌ చేస్తున్నారు. ఎలా అంటే..

  • Published Feb 13, 2024 | 2:13 PMUpdated Feb 13, 2024 | 2:13 PM
నానికి లైన్ క్లియర్ చేస్తున్న అల్లు అర్జున్! అచ్చం తారక్ లానే!

సినిమాల విడుదల విషయంలో టాలీవుడ్‌ హీరోలు ఒకరికి ఒకరు తోడుగా నిలుస్తారు. అనేక సందర్భాల్లో ఇది రుజువైంది. తాజాగా సంక్రాంతి సందర్భంగా రవితేజ తన ఈగల్‌ సినిమా విడుదలను వాయిదా వేసుకుని పొంగల్‌ సినిమాలకు దారి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈగల్‌ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్‌ అయ్యి సూపర్‌హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. హీరోలు, నిర్మాతలు ఇలా సంయమనంతో వ్యవహరించడం వల్ల ఆయా సినిమాల కలెక్షన్లు బాగుంటాయి.. ఇండస్ట్రీలో స్నేహపూర్వక వాతావరణం కూడా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ జాబితాలోకి ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, నాచురల్‌ స్టార్‌ నానిలు చేరారు. నానికి బన్నీ సాయం చేసేందుకు రెడీ అవుతన్నాడు. ఇంతకు ఏ విషయంలో అంటే..

ప్రస్తుతం అల్లు అర్జున్‌ పుష్ప 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను ఆగస్ట్‌ 15 న పాన్‌ ఇండియా వైడ్‌గా రిలీజ్‌ చేస్తామని మేకర్స్‌ గతంలోనే ప్రకటించారు. సినిమా షూటింగ్‌ కూడా శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల పోస్ట్‌ పోన్‌ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ముందు చెప్పిన ప్రకారం పుష్ప 2 ఆగస్ట్‌ 15న విడుదల కాకపోతే.. ఆ రోజున నాచురల్‌ స్టార్‌ నాని సినిమా సరిపోదా శనివారం రిలీజ్‌కు రెడీ అవుతోందని తెలుస్తోంది.

ఒకవేళ ఆగస్ట్‌ 15న నాని సినిమా విడుదల కుదరకపోతే.. ఆగస్ట్‌ 29న వచ్చేలా మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఆ డేట్‌కు చాలా అంటే చాలా ముందుగానే నాని సరిపోదా శనివారం సినిమా షూటింగ్‌ పూర్తి అవుతందని తెలుస్తోంది. అంటే అల్లు అర్జున్‌ పుష్ప 2 కనుక ఆగస్ట్‌ 15న విడుదల కాకపోతే.. అదే రోజున నాని సినిమా రానుంది. అలా బన్నీ నానికి సాయం చేయనున్నాడు. అయితే నాని సరిపోదా శనివారం సినిమా విడుదలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

గతంలో విజయ్‌దేవరకొండ విషయంలో తారక్‌ కూడా ఇలానే వ్యవహరించాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తోన్న దేవర చిత్రం.. రిలీజ్‌ డేట్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. తారక్‌ మూవీ విడుదల తేదీన అనగా ఫిబ్రవరి 5న దేవర స్థానంలో విజయ్‌దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ విడుదల కానుంది. మేకర్స్‌ ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. దాంతో అచ్చం తారక్‌లానే.. బన్నీ కూడా నాని సరిపోదా శనివారం సినిమాకు సాయం చేసేందుకు రెడీ అయ్యాడు అంటున్నారు ఫ్యాన్స్‌.

ఇక నాని కెరీర్‌లో 31వ సినిమాగా వస్తోన్న సరిపోదా శనివారం చిత్రంలో ప్రియాంక అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఎస్‌జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు వివేక్‌ ఆత్రేయ డైరెక్టర్‌. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దసరా, హాయ్‌ నాన్న సినిమాల సక్సెస్‌తో దూసుకుపోతున్న నాని.. సరిపోదా శనివారంతో హ్యాట్రిక్‌ హిట్టు కొట్టాలని భావిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి