iDreamPost

జగన్ ప్రభుత్వ విధానం దేశం మోత్తానికి ఆదర్శం కానుందా??

జగన్ ప్రభుత్వ విధానం దేశం మోత్తానికి ఆదర్శం కానుందా??

కరోనా వైరస్ (కొవిడ్-19) వ్యాప్తికి అడ్డుకట్ట వెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుండడంతో లాక్ డౌన్ పొడిగింపు విషయంలో ఇప్పటివరకు కెంద్రం తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకపోవడంతో దీనిపై కెంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబుతుందనే అంశంపై మీడియాలో రక రకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.

ఈనేపధ్యంలో గత శనివారం అన్ని రాష్ట్రాలు, కెంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఒకరిద్దరు తప్ప మిగతా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ ని మరో రెండు వారాల పాటు పొడిగించాలని ప్రధానికి సూచించారు. కానీ ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం అందరు ముఖ్యమంత్రులకు భిన్నంగా లాక్ డౌన్ ని దశలవారీగా ఎత్తివెయ్యాలని ప్రధానికి సూచించిన సంగతి తెలిసిందే.

జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన విధానం ప్రకారం కరోనా పాజిటీవ్ కేసులు ఆధారంగా రాష్ట్రంలోని మండలాలను, పట్టణాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ లుగా విభజించాలని సూచించారు. దాని ఆధారంగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయిన మండలాలను, ప్రాంతాలను రెడ్ జోన్ లో ఉంచి ఆ జోన్ పరిధిలో కఠినమైన ఆంక్షలు విధించాలని, ప్రాంతంలో ప్రజరవాణా వ్యవస్థ తో పాటు కార్లు, బైకులు పై పూర్తిగా ఆంక్షలు విధించాలని, బ్యాంకులు ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు, పరిశ్రమలు, మాల్స్, సినిమా హాళ్లు మూసి ఉంచాలని సూచించారు. ఇక ఆరెంజ్ జోన్ లో కుడా కఠినమైనా ఆంక్షలు అమలు చేస్తూనే కొన్నింటికి మినహాయింపు ఇవ్వడం, ఇక పై రెండు జోన్లతొ పోలిస్తే గ్రీన్ జోన్ పరిధిలో కొంత ఆంక్షలు సడలించి సాధారణ కార్యకలాపాలకు పరిమిత స్థాయిలో అనుమతులు ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి సూచించారు.

కరోనా వైరస్ ని ఎదుర్కోవడంలో దీర్ఘ కాలిక వ్యుహాలు అవలంభించాలని, ఆర్ధిక వ్యవస్థ, రోజువారి కూలీలు, రైతుల జీవనోపాధి, చిన్న చిన్న వ్యాపారస్తులను దృష్టిలో ఉంచుకొని లాక్ డౌన్ ని దశల వారీగా ఎట్టివెయ్యాలని జగన్ సూచించారు. ఇదే సమయంలో కరోనా నియంత్రించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని.. టెస్ట్లుల సంఖ్య ను పెంచాలని జగన్ సూచించారు.

ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తో పాటు అనేక మంది ఆర్ధిక వేత్తలు.. వ్యాపార వేత్తలు, సామాజిక వేత్తలు.. జయప్రకాశ్ నారాయణ తో సహా అనేక మంది అయా రంగాలకు చెందిన మేధావులు కుడా ప్రస్తుత పరిస్తితుల్లో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉండడంతో లాక్ డౌన్ ని కొనసాగించడం అంత శ్రేయస్కరం కాదని, దశలవారీగా లాక్ డౌన్ ను ఎత్తివెయాలని సూచిస్తున్నారు.

ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడి కుడా ఇదే అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఆయన కుడా కరోనా పాజిటివ్ కేసుల ఆధారంగా దేశంలో ప్రాంతాలని రెడ్.. ఆరెంజ్.. గ్రీన్.. ఇలా మూడు క్లస్టర్లు గా విభజించాలానే నిర్ణయానికి వచ్చారని తెలుస్తుంది. దానిపై ఈరోజు కెంద్ర ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన ప్రక్కటన వచ్చే అవకాశం ఉంది.

కాగా లాక్ డౌన్ మొదటి దశలో జాన్ హైతో జహాన్ హొగా.. అన్న ప్రధాని పిలుపు కాస్తా లాక్ డౌన్ రెండవ దశలో జాన్ భీ.. జహాన్ భీ..( Life & livelihood ) గా మారే అవకాశం ఉంది. ఈ దశలో ప్రజల ప్రాణాల తో పాటు వారికి ఆహారం.. ఉపాధి.. కూడా ముఖ్యమేనని ప్రధాని భావిస్తున్నారు. ఒక వేళ ఇదే కనుక జరిగితే మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పటికి దేశంలోని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులందరికంటే భిన్నంగా కరోనా వైరస్ మహమ్మారి విషయంలో వాస్తవికత ఆధారంగా అన్ని కోణాల్లో సీరియస్ గా అలోచించి ప్రజా ప్రయోజనార్ధం సహాసొపెతమైన నిర్ణయం తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి దూరధృష్టిని అభినందిచక తప్పదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి