iDreamPost

పవన్‌ను బాగా మోటివేట్‌ చేసినట్టున్నారు

పవన్‌ను బాగా మోటివేట్‌ చేసినట్టున్నారు

పవన్‌ కల్యాణ్‌ ఏం మాట్లాడినా సెన్షేషన్‌ అవుతుంది. సాధ్యాసాధ్యాలతో సంబంధం లేకుండా తాను చేస్తానంటూ హామీలుస్తుంటారు. తాజాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని కూలుస్తానంటూ శపథాలు చేస్తున్నారు. ప్రభుత్వం మూడు, కాదు 30 రాజధానులను పెట్టినా వాటన్నింటిని మళ్లీ ఒక్కటి చేసి అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తాన్నారు. ఇలా మాట్లాడి ప్రత్యర్థుల చేతిలో ట్రోల్‌ అవుతున్నారు. బాగా మోటివేట్‌ అయిన సమయంలోనే పవన్‌ ఇలా మాట్లాడతారని విశ్లేషకులు చెబుతున్నారు.

పవన్‌ కల్యాణ్‌ పార్టీ జనసేన ఇటీవల బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ప్రస్తుతం జరగబోయే స్థానిక ఎన్నికల నుంచి వచ్చే సాధారణ ఎన్నికల వరకు ఈ పొత్తు కొనసాగుతుందని ఇరు పార్టీలు ప్రకటించాయి. ఈ పొత్తుకు ముందు బీజేపీ నేతలు పవన్‌ కల్యాణ్‌ ను బాగా మోటివేట్‌ చేసినట్లుగా పవన్‌ తాజా మాటలు వల్ల అర్థమవుతోంది. రెండున్నరేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పడిపోతుందని, మళ్లీ ఎన్నికలు వస్తాయంటున్నారు. ప్రస్తుతం వైస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 8 నెలలు కావస్తోంది. పవన్‌ చెప్పిన సమయం రెండున్నరేళ్లు అంటే.. మొత్తంగా మూడేళ్లకే ప్రభుత్వం పడిపోతుందన్నది పవన్‌ మాటల అర్థం.

Read Also: కూల్చివేయడానికి ఇదేమన్నా సినిమా సెట్టింగా పవన్ కళ్యాణ్ ?

ఏపీ శాసనభలో 175 సీట్లకు గాను వైఎస్సార్‌సీపీకి 151 ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీకి 23 మందికి గాను ఇద్దరు దూరంగా ఉండడంతో ప్రస్తుతం 21 మంది మిగిలారు. పవన్‌ కల్యాణ్‌ పార్టీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే ఆ పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇంత బలమైన ప్రభుత్తాన్ని కూలుస్తానని, పడిపోతుందని పవన్‌ కల్యాణ్‌ మాట్లాడడం జబర్దస్‌ కామెడీని మించిపోతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కర్ణాటక, మహారాష్ట్రలలో మాదిరిగా బొటామోటి మెజార్జీ, సంకీర్ణ పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు అవకాశం ఉంది. జేడీఎస్, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి కర్ణాటకలో కుమార స్వామి ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టి అధికారం పీఠమెక్కింది. మహారాష్ట్రలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వంలోని అసంతృప్తులను అవకాశంగా మలుచుకోవచ్చు. అయితే ఆయా రాష్ట్రాలలో ఉన్న అవకాశం ఏపీలో లేదనే ఘంటాపథంగా చెప్పొచ్చు.

Read Also: చంద్ర‌బాబూ దండం పెట్టాల్సింది మీరు కాదు, మేము

ఏపీలో సాధారణ మెజారిటీ 88 సీట్లు. వైఎస్సార్‌సీపీకి ఉన్న స్థానాలు 151. సాధారణ మెజార్టీ కంటే వైఎస్సార్‌సీపీకి అదనంగా 63 సీట్లు ఎక్కువ ఉన్నాయి. ఇక జనసేన ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. వీరిని కూడా కలుపుకుంటే ఈ బలం 66కి పెరుగుతుంది. మరి ఇంత మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడం సాధ్యమయ్యే పనేనా..? ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఈ విధానం కాకుండా మరేదైనా ఆలోచన ఉందా..? బీజేపీ నేతలు పవన్‌ కల్యాణ్‌కు చెప్పి మోటివేట్‌ చేసి ఉంటారు..? ఎలాంటి నమ్మకంతో పవన్‌ కల్యాణ్‌ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం. రెండున్నరేళ్లలో ఎన్నికలు వస్తాయని చెబుతున్నారో రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తా అనడంతో సోషల్‌ మీడియాలో వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులకు మరోసారి టార్గెట్‌ అయ్యారు. పవన్‌ను ట్రోల్‌ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి