iDreamPost

MIM చరిత్రలో తొలిసారి.. రాజకీయాల్లోకి అక్బరుద్దీన్‌ ఓవైసీ కూతురు?

MIM చరిత్రలో తొలిసారి.. రాజకీయాల్లోకి అక్బరుద్దీన్‌ ఓవైసీ కూతురు?

తెలంగాణలో అతి త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో సిద్ధం అయిపోతున్నాయి. ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేసే కొత్త కొత్త వ్యూహాలతో.. వారి వ్యూహాలను తిప్పి కొట్టే ప్రతి వ్యూహాలతో ముందుకు దూసుకెళుతున్నాయి. ఇక, బీఆర్‌ఎస్‌ పార్టీ మిత్ర పార్టీ అయిన ఎమ్ఐ‌ఎమ్‌ కూడా కూడా వచ్చే ఎన్నికల కోసం తీవ్ర స్థాయిలో కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. చరిత్రను తిరగరాసే యోచన ఉందట.

ఎమ్ఐ‌ఎమ్‌ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ తన కూతుర్ని ఎన్నికల్లో పోటీ చేయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు ఫాతిమా ఓవైసీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందన్న టాక్‌ వినిపిస్తోంది. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న అక్బరుద్దీన్.. తన కూతురు లండన్‌లో లా చదువుతోందని, త్వరలో హైదరాబాద్‌ వచ్చి.. ప్రజాసేవలో భాగమవుతుందని అన్నారు. ఆ మాటల వెనుక అర్థం ఇదేనన్న చర్చ బయలు దేరింది.  ఎమ్‌ఐఎమ్‌లో ఇప్పటి వరకు ఒక్క మహిళా నేత కూడా లేదు. ఈ పార్టీపై పురుషాధిక్య పార్టీ అన్న ముద్ర కూడా పడింది.

ఆ ముద్రను చెరిపేయడానికి అక్బరుద్దీన్‌ ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆమెను నేరుగా ఎన్నికల బరిలోకి దింపుతారా? లేక ఏదైనా నామినేటెడ్‌ పోస్టు ఇస్తారా? అన్నదానిపై క్లారిటీ లేదు. ఒక వేళ ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తే.. హైదరాబాద్‌నుంచి పోటీ చేయిస్తారా? లేక రాష్ట్రంలోని వేరే చోట నుంచి పోటీ చేయిస్తారా? అన్నదానిపై కూడా క్లారిటీ లేదు. మరి,  ఎమ్ఐ‌ఎమ్‌ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు ఫాతిమా ఓవైసీ పొలిటికల్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి