iDreamPost

BRS శాసన సభాపక్ష నేతగా కేసీఆర్, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం!

  • Published Dec 09, 2023 | 12:38 PMUpdated Dec 09, 2023 | 12:38 PM

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు.

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు.

  • Published Dec 09, 2023 | 12:38 PMUpdated Dec 09, 2023 | 12:38 PM
BRS శాసన సభాపక్ష నేతగా కేసీఆర్, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం!

గత నెల 30న తెలగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడ్డాయి. దశాబ్దకాలం పాటు పరిపాలన కొనసాగించిన బీఆర్ఎస్ ని ఓడించి కాంగ్రెస్ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నేడు కేబినెట్ మంత్రులకు వారి శాఖలు కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. బీఆర్ఎస్ పాలన సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్, బీజేపీ లు కీలకంగా వ్యవహరించాయి. ఇప్పుడు అధికార పార్టీగా కాంగ్రెస్ కొనసాగుతుంది.. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, బీజేపీ లు ప్రధాన ప్రతిపక్ష పాత్ర వహించనుననాయి. ఇక తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య సమరం ఎలా ఉండబోతుందూ ముందు ముందు చూడాలి.   వివరాల్లోకి వెళితే..

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసన సభాపక్ష నేగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను ఆ పార్టీ ఎమ్మెల్యే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బీఆర్ఎస్‌పి నేత కేశవరావు అధ్యక్షతన తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కేసీఆర్ పేరును ప్రతిపాదించగా.. మాజీ మంత్రులు కడియం శ్రీహరి, శ్రీనివాస్ యాదవ్ తదితరులు కేసీఆర్ ని బలపరిచారు. ఇక శాసన సభ పక్షం మితగా కమిటీని ఎంపికే చేసే బాధ్యతలను కేసీఆర్ కి అప్పగిస్తున్నట్లు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమానికి 38 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు.. కాకపోతే కేసీఆర్ కి శస్త్ర చికిత్స కారణంగా ఆయన గైర్హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు వెళ్ళి నివాళులర్పించి ప్రత్యేక బస్సులో అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరారు.

ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే, ప్రొటెం స్పీకర్ గా నియమితులైన అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉంటే.. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఒవైసీని ఎంపిక చేయడంపై ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కీలక భేటీ తర్వాత ఈ నిర్ణయం ప్రకటించారు. రెగ్యూలర్ స్పీకర్ ఎన్నిక తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి