iDreamPost

ఐర్లాండ్‌తో తొలి టీ20.. భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే! టీమ్‌ అదిరిపోయిందిగా..

  • Author Soma Sekhar Published - 04:00 PM, Fri - 18 August 23
  • Author Soma Sekhar Published - 04:00 PM, Fri - 18 August 23
ఐర్లాండ్‌తో తొలి టీ20.. భారత ప్లేయింగ్‌ ఎలెవన్‌ ఇదే! టీమ్‌ అదిరిపోయిందిగా..

ఆసియా కప్, ప్రపంచ కప్ ముంగిట టీమిండియా ప్రయోగాల బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ రెండు మెగాటోర్నీలకు ముందు యంగ్ ప్లేయర్లకు పరీక్ష పెడుతోంది టీమిండియా మేనేజ్ మెంట్. యంగ్ ప్లేయర్లు కీలక టోర్నీల్లో ఒత్తిడిని ఎలా జయించాలో ఇప్పటి నుంచే వారికి తెలియజేసేలా ముందు జగ్రత్తగా ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. అందులో భాగంగానే విండీస్ టూర్ నుంచి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతిని ఇస్తూ.. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తోంది. ఇప్పటికే తిలక్ వర్మ, జైశ్వాల్ లాంటి ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టగా.. తాజాగా శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఐర్లాండ్ టీ20 సిరీస్ ద్వారా మరికొంత మంది యువ ఆటగాళ్లు టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక శుక్రవారం ఐర్లాండ్ తో జరగబోయే తొలి టీ20 మ్యాచ్ లో ప్లేయింగ్ లెవన్ అదిరిపోయింది.

మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం యంగ్ టీమిండియా ఐర్లాండ్ చేరుకుంది. ఈ సిరీస్ కు టీమిండియా స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. సీనియర్లు విశ్రాంతిని ఇస్తూ.. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చారు సెలక్టర్లు. అందులో భాగంగానే రింకూ సింగ్, జితేశ్ శర్మలను తొలిసారిగా టీమిండియాకు ఎంపిక చేశారు. ఇక శుక్రవారం డబ్లిన్ వేదికగా జరగబోయే తొలి టీ20లో టీమిండియా అదిరిపోయే ప్లేయర్లతో దిగబోతున్నట్లు తెలుస్తోంది. జట్టులో అందరు అద్భుతమైన ఆటగాళ్లే ఉన్నారు. ఇక ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా యశస్వీ జైస్వాల్ తో పాటు రుతురాజ్ గైక్వాడ్ దిగనున్నాడు.

ఐపీఎల్ 2023 నయా సంచలనం రింకూ సింగ్ ఈ మ్యాచ్ ద్వారా తన ఎంట్రీని ఘనంగా చాటాలని భావిస్తున్నాడు. అతడికి తోడు బౌలర్ జితేశ్ శర్మ సైతం అవకాశం ఇస్తే.. తన ఎంట్రీని గ్రాండ్ గా ఇవ్వాలని ఎదురుచూస్తున్నాడు. వికెట్ కీపర్ గా సీనియర్ సంజూ శాంసన్ తనకు వచ్చిన మరో అవకాశాన్ని ఏవిధంగా సద్వినియోగం చేసుకుంటాడో వేచిచూడాలి. శివమ్ దుబే, వాషింగ్టన్ సుందర్ ల రూపంలో ఆల్ రౌండర్స్ ఉండగా.. రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, కెప్టెన్ బుమ్రా, ముకేష్ కుమార్ సత్తా చాటగల ఆటగాళ్లు. చాలా రోజుల తర్వాత బుమ్రా రీఎంట్రీ ఇస్తుండటం.. వరల్డ్ కప్ ముంగిట టీమిండియాకు శుభసూచకం. మరి ఈ యంగ్ ప్లేయర్లు పసికూనపై ఏవిధంగా రాణిస్తారో తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగక తప్పదు. అయితే ఐర్లాండ్ జట్టును సైతం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఆ జట్టులో కూడా మ్యాచ్ విన్నర్లు ఉన్నారు.

టీమిండియా జట్టు (అంచనా)

రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్(కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దుబే, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ముకేష్ కుమార్

ఐర్లాండ్ జట్టు (అంచనా)

అండ్రూ బాల్బెర్నీ, పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), లోర్కాన్ టూకర్, హ్యారీ టెక్టర్, జార్జి డాక్ రెల్, గ్రెత్ డెలానీ, కర్టిస్ కాంపర్, మార్క్ అడైర్, జోషువా లిటిల్, బ్యారీ మెకర్తీ, బెంజమిన్ వైట్

ఇదికూడా చదవండి: మా అమ్మ కల నెరవేరింది.. రింకూ సింగ్ భావోద్వేగం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి